ఆ హీరోయిన్ అన్నయ్య అంటే పిచ్చెక్కేది : శ్రీకాంత్

రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లో ఫ్యామిలీ హీరోగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సంపాదించుకున్నారు హీరో శ్రీకాంత్.గత కొన్నేళ్లుగా పరిమితంగా సినిమాల్లో నటిస్తున్న శ్రీకాంత్ విలన్ పాత్రల్లో కూడా నటిస్తూ మెప్పిస్తున్నారు.15 ఏళ్ల క్రితం శ్రీకాంత్ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్లు కావడంతో పాటు ప్రేక్షకుల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది.హీరోయిన్లు రాశి, సౌందర్య, రోజాలతో శ్రీకాంత్ ఎక్కువగా నటించేవారు.

 Hero Srikanth Interesting Comments About Heroine Roja,hero Srikanth ,heroine Roj-TeluguStop.com

ఒక ఇంటర్వ్యూలో భాగంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ హీరోయిన్, ఎమ్మెల్యే రోజా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.రోజా తాను కలిసి మూడు సినిమాల్లో నటించామని రోజా తనను ఎప్పుడూ అన్నయ్య అని పిలిచేదని ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.

ఒకరోజు షూటింగ్ లో భాగంగా దర్శకుడు రొమాంటిక్ సీన్ చెప్పారని.ఆ సమయంలో రోజా అలా చేద్దాం అన్నయ్యా అన్నయ్యా అంటే తనకు చిరాకు, కోపం వచ్చేదని చెప్పారు.

పదేపదే అలా అనడంతో అన్నయ్య, అన్నయ్య అని పిలుస్తుంటే తనకు రొమాంటిక్ ఫీల్ రావడం లేదని.కొంతసేపైనా అన్నయ్య అనడం ఆపాలని రోజాకు చెప్పానని శ్రీకాంత్ వెల్లడించారు.

ఇప్పటికీ రోజా తాను మంచి ఫ్రెండ్స్ అని తెలిపారు.శ్రీకాంత్, రోజా జంటగా నటించిన సినిమాల్లో తిరుమల తిరుపతి వెంకటేశ, క్షేమంగా వెళ్లి లాభంగా రండి సినిమాలు హిట్ అయ్యాయి.

అయితే రాజకీయాల్లోకి వెళ్లిన తరువాత రోజా ఎక్కువగా సినిమాల్లో నటించడం లేదు.

Telugu Srikanth, Roja-Movie

మరోవైపు శ్రీకాంత్ కొడుకు రోషన్ ను హీరోగా నిలబెట్టే పనిలో పడ్డారు.2016లో రోషన్ హీరోగా నటించిన నిర్మలా కాన్వెంట్ విడుదల కాగా ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా మిగిలింది.శ్రీకాంత్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్లలో ఒకటైన పెళ్లి సందడి సినిమాను రోషన్ హీరోగా మళ్లీ అదే పేరుతో రీమేక్ చేస్తున్నారని ఈ రీమేక్ లో శ్రీకాంత్ కూడా కనిపిస్తారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube