నందమూరి ఫ్యామిలీ( Nandamuri Family ) నుంచి మూడోతరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా తక్కువ సమయం లోనే స్టార్ డమ్ అందుకొని ఇండస్ట్రీలో ఎవరికి సొంతం కాని విధంగా మాస్ హీరోగా తనను తాను ఎలివేట్ చేసుకున్నాడు.ఇక మొత్తానికి ఆయన చేసిన సినిమాలో ప్రతిదీ సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించే విధంగానే ఉంటాయి.
ఇక అందులో కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ నటుడిగా మాత్రం ఆయన ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు.ఇక ఇదిలా ఉంటే మొదట్లో ఆయన చేసిన మాస్ సినిమాలను( Mass Movies ) చూసి మరి కొంతమంది హీరోలు కూడా అలాంటి సినిమాలనే చేయాలనే కాన్సెప్ట్ పెట్టుకొని ముందుకు సాగారు.
అయితే ఆ సినిమాలు ఏవి అంతగా సక్సెస్ సాధించలేదు.
దానికి ముఖ్య కారణం ఏంటి అంటే ఎన్టీఆర్ చేసిన సినిమాలు వేరు, వాళ్ళు చేసిన సినిమాలు వేరు.ఆయన ను చూసి అలాంటి సినిమాలే చేసిన వాళ్లలో తారకరత్న, నితిన్ లాంటి హీరోలు ఉన్నారు.నితిన్ ఎన్ శంకర్ డైరెక్షన్ లో చేసిన రామ్ సినిమా( Ram Movie ) యాక్షన్ సినిమా అయినప్పటికీ, ఆ సినిమాలో కథ అంత క్వాలిటీ గా లేకపోవడంతో అది సక్సెస్ సాధించలేదనే చెప్పాలి.
ఇక మొత్తానికైతే ప్రస్తుతం ఎన్టీఆర్ మాత్రమే స్టార్ హీరోగా, మాస్ హీరోగా ఎదిగాడు.
ఇక మిగిలిన వాళ్ళు పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా అయిపోయింది.అందువల్లే ఒకరిని చూసి మనం సినిమా చేయడం కంటే మనకు ఎలాంటి కథలు సెట్ అవుతాయో వాటిని తెలుసుకొని అలాంటి సినిమాలు చేసినప్పుడే మనం సక్సెస్ అవుతామంటూ సిని మేధావులు సైతం ఈ విషయంలో చాలాసార్లు యంగ్ హీరోలకి( Young Heroes ) సలహాలను ఇస్తూ వస్తున్నారు…చూడాలి మరి ఎన్టీయార్ ఇప్పుడు చేస్తున్న దేవర సినిమాతో ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనేది….