'అంటే సుందరానికీ' అనే బ్లాక్ బస్టర్ తీశాం : ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో హీరో నాని

సినిమా విడుదలకు ముందు మంచి సినిమా తీశాం, బ్లాక్ బస్టర్ చేయాల్సింది మీరే అని చెప్తాం.కానీ ఈసారిలా అలా కాదు.

 Hero Nani Speech In Ante Sundaraniki Trailer Release Event Details, Hero Nani ,-TeluguStop.com

మేము ‘అంటే సుందరానికీ’ అనే బ్లాక్ బస్టర్ తీశాం.ఇంక దాన్ని ఎక్కడి తీసుకెల్తారో మీ ఇష్టం” అన్నారు నేచురల్ స్టార్ నాని.

నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అంటే సుందరానికీ’.ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వైజాగ్ లో అభిమానుల మధ్య వేడుకగా జరిగింది.

నాని, హీరోయిన్ నజ్రియా, నిర్మాత వై రవి శంకర్ పాటు చిత్ర బృందం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొని సందడి చేశారు.

ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ.

వైజాగ్ మా అత్తగారి ఊరు.వైజాగ్ కి అల్లుడు వచ్చాడు.(నవ్వుతూ) అల్లుడు వచ్చినపుడు అల్లుడికి విందుభోజనం పెడతారు.కానీ జూన్ 10న అల్లుడే విందు భోజనం పెడతాడు.బేసిగ్గా సినిమా విడుదలకు ముందు మంచి సినిమా తీశాం, బ్లాక్ బస్టర్ చేయాల్సింది మీరే అని చెప్తాం.కానీ ఈసారిలా అలా కాదు.

మేము బ్లాక్ బస్టర్ తీశాం.ఇంక దాన్ని ఎక్కడి తీసుకెల్తారో మీ ఇష్టం.

జూన్ 10నుండి ‘అంటే సుందరానికీ’ మీది.ఒక సినిమా విజయానికి యాక్షన్, హ్యుమర్, ఎమోషన్ కారణం.

ఏడాది యాక్షన్ కావలసినంత దొరికింది.హ్యుమర్, ఎమోషన్ కోసం ప్రేక్షకులు ఆకలితో ఎదురుచూస్తున్నారు.

జూన్ 10 ‘అంటే సుందరానికీ’ థియేటర్ లో కావాల్సినంత హ్యుమర్, ఎమోషన్ దొరుకుతుంది.నన్ను మీ ఫ్యామిలీలో ఒకరిగా చూస్తున్న ప్రేక్షకులకు, వైజాగ్ ప్రేక్షకులు ఎప్పటికీ రుణపడి వుంటాను.‘అంటే సుందరానికీ’ చాలా బ్యూటీఫుల్ గా వుంటుంది.ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తారు.

వైజాగ్ సముద్రంలాగ హ్యుమర్, ఎమోషన్ ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే వుంటాయి.

మైత్రీ మూవీ మేకర్స్ తో నాకు ఇది రెండో సినిమా.

కచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుంది.ఈ సినిమా తర్వాత అంటే.

ని మించిన సినిమా చేయాలి, చేస్తామని నమ్ముతున్నాను.ఈ సినిమాకి పనిచేసిన టెక్నికల్ టీంకి కృతజ్ఞతలు.

నజ్రియా ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకుంది.లీల పాత్రలో తనని తప్పా ఎవరినీ ఊహించుకోలేరు.

మీ అందరితో కలసి ఎప్పుడు సినిమా చూస్తానా అని ఎదురుచూస్తున్నాను.జూన్ 10న అరిచి అరిచి, నవ్వినవ్వి మీ చొక్కాలు తడిచిపోవాలి.” చెప్పారు నాని.

Telugu Antesundaraniki, Nani, Nani Speech, Nazriya, Mytri Makers, Ravishankar-Mo

హీరోయిన్ నజ్రియా మాట్లాడుతూ.వైజాగ్ గురించి చాల గొప్ప విన్నాను.ఇక్కడకి రావడం చాలా ఆనందంగా వుంది.గత ఏడాది నా సినీ ప్రయాణం గొప్ప అనిపించింది.‘అంటే సుందరానికీ’తో మొదటి తెలుగు సినిమా చేయడం, తెలుగులో డబ్బింగ్ చెప్పడం, ఇప్పుడు వైజాగ్ రావడం ఈ మూడు గొప్ప ఆనందాన్ని ఇచ్చాయి.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ గారు, రవి శంకర్ గారికి కృతజ్ఞతలు.మైత్రీ మూవీ మేకర్స్ లేకుంటే ఈ ప్రయాణం ఇంత గొప్పగా జరిగేది కాదు.

దర్శకుడు వివేక్ ఆత్రేయ గారి తో వర్క్ చేయడం చాలా గొప్ప అనుభూతి.ప్రతి రోజు షూటింగ్ ని ఎంజాయ్ చేశాను.నన్ను , కథని ఎంతో అందంగా చూపించిన సినిమాటోగ్రాఫర్ నికేత్ బొమ్మికి కృతజ్ఞతలు, అలాగే లతా నాయుడు పల్లవి.అందరికీ థ్యాంక్స్.

నాని గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి.నాని లేకుండా ఈ జర్నీ ఇంత మెమరబుల్ గా వుండేది కాదు.

నాని గొప్ప కోస్టార్.ఇది నా మొదటి తెలుగు సినిమా.

నాపై చాలా ప్రేమని చూపించారు.మీరు చూపిన అభిమానానికి కృతజ్ఞతలు.

తప్పకుండా మరిన్ని తెలుగు సినిమాలు చేస్తాను.జూన్ 10న అందరం థియేటర్ లో కలుద్దాం.‘అంటే సుందరానికీ’ ఎంజాయ్ చేద్దాం” అన్నారు.

Telugu Antesundaraniki, Nani, Nani Speech, Nazriya, Mytri Makers, Ravishankar-Mo

ఈ సందర్భంగా నిర్మాత వై రవిశంకర్ మాట్లాడుతూ.నేను వైజాగ్ లోగ్రాడ్యుయేషన్ చేశాను.ఇక్కడికి వచ్చినపుడు కాలేజీ రోజులు గుర్తుకు వస్తుంటాయి.ఇక్కడి ఎన్నిసార్లు వచ్చినా అంతే ఆనందంగా వుంటుంది.‘అంటే సుందరానికీ’ జూన్ 10న వస్తుంది.నాని గారు తన పెర్ఫార్మెన్స్ తో విశ్వరూపం చూపిస్తారు.నాని, నజ్రియా, నరేష్, నదియా ఇలా అందరూ ఎక్స్ ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్ మిమ్మల్ని నవ్వించి మెప్పిస్తారని నమ్ముతున్నాను.

ఈ సీజన్ ని భీమ్లా నాయక్ తో బిగిన్ చేశాం.మళ్ళీ ‘అంటే సుందరానికీ’తో కాలేజీలు, స్కూల్స్ తెరిచే లోపల సీజన్ ని క్లోజ్ చేస్తున్నాం.

దీని తర్వాత కూడా విరాటపర్వం లాంటి మంచి సినిమాలు వస్తున్నాయి.కాలేజీలు స్కూల్స్ ఓపెన్ అయ్యేలోపల మా సినిమా ‘అంటే సుందరానికీ’ జూన్ 10న చూసి హాయిగా నవ్వుకొని మళ్ళీ కాలేజీలు, స్కూల్స్ లో వెళ్ళొచ్చు.

జూన్ 10న ఎక్స్ ట్రార్డినరీ సినిమా చూడబోతున్నాం.దర్శకుడు వివేక్ ఆత్రేయ, సంగీత దర్శకుడు వివేక్ సాగర్, సినిమాటోగ్రాఫర్ నికేత్ బొమ్మి, ఎడిటర్ రవితేజ గిరిజాల, ప్రొడక్షన్ డిజైనర్ లతా నాయుడు ఇలా ఈ చిత్రానికి పని చేసిన సాంకేతిక నిపుణులందరికీ కృతజ్ఞతలు.

Telugu Antesundaraniki, Nani, Nani Speech, Nazriya, Mytri Makers, Ravishankar-Mo

మా సంస్థకు ‘అంటే సుందరానికీ’లాంటి మంచి సినిమాని ఇచ్చారు.మా హీరో నాని గారు ఎక్స్ ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.గ్యాంగ్ లీడర్ షూటింగ్ జరుగుతున్నపుడు నాని గారిని హాగ్ చేసుకొని విష్ చేసేవాళ్ళం.అప్పటికే జర్సీ వచ్చింది.అందులో నాని గారు కనబరిచిన నటనకు ఆయనపై గౌరవం రెట్టింపయ్యింది. ‘అంటే సుందరానికీ’లో నాని గారి నట విశ్వరూపం చూస్తారు.

నజ్రియా ఈ సినిమా ఒప్పుకోవడం చాలా ఆనందంగా వుంది.నజ్రియా గారి భర్తగారు ఫహద్ ఫాసిల్ ని పుష్పతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాం.

ఇప్పుడు నజ్రియా గారు ‘అంటే సుందరానికీ’తో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం మరింత ఆనందంగా వుంది.ఇందులో ఆమె అద్భుతమైన నటన కనబరిచారు.ప్రేక్షకులకు మరోసారి ధన్యవాదాలు.‘అంటే సుందరానికీ’ చిత్రాన్ని పెద్ద విజయం చేయాలనీ కోరుతున్నాను.మళ్ళీ సక్సెస్ వేడుకని వైజాగ్ లో జరుపుకుందాం.” అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube