జీవో 86పై దాఖలైన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం వైన్ షాపులపై జారీ చేసిన జీవో 86 ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.
జీవో ప్రకారం ఎస్టీలకు ఐదు శాతం వైన్స్ ను కేటాయించకపోవడంపై పిటిషనర్ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు.దీంతో రాష్ట్ర ప్రభుత్వంతో పాట ఎక్సైజ్ శాఖ, గిరిజన శాఖ మరియు సీఎస్ కు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
అనంతరం నాలుగు వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది.కౌంటర్ దాఖలు చేయని పక్షంలో జీవో రద్దుపై ఆలోచిస్తామని కోర్టు స్పష్టం చేసింది.
తరువాత తదుపరి విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.