వామ్మో.. 700 సంవత్సరాల నుంచి ఆ గుడిలో దీపం వెలుగుతూనే ఉందా..?!

మన హిందూ సంప్రదాయాలు ఎంతో గొప్పగా ఉంటాయి.దేవుడికి పూజలు చేయడం, నిత్యం దీపారాధన చేయడం, గుళ్లకు వెళ్లడం లాంటి పనులను నిత్యం క్రమం తప్పకుండా చేస్తూ ఉంటాము.

 Has The Lamp Been Lit In That Temple For 700 Years, 700 Years, Sri Sitaraswamy T-TeluguStop.com

అయితే నిత్య దీపారాధన చేయడం కుదరని వాళ్ళు వారంలో కనీసం రెండు సార్లయినా తమకు నచ్చిన రోజుల్లో దేవుడి గదిలో దీపం పెట్టి పూజ చేస్తూ ఉంటాము.అయితే కొన్ని కొన్ని సార్లు దేవాలయాల్లో అఖండ దీపం పెట్టి నిత్యం పూజలు చేస్తూ ఉంటారు.

అలాగే ఒక్కోసారి ఇంట్లో నోములు, వ్రతాలు చేసుకునేటప్పుడు కూడా ఇంట్లో దీపం పెట్టి కొండెక్కకుండా చూసుకుంటూ ఉంటాము.అయితే ఓ గుడిలో వెలిగించిన దీపం మాత్రం ఏకంగా ఏడు వందల సంవత్సరాల నుంచి అలాగే ఆరిపోకుండా వెలుగుతూనే ఉందట.

ఏంటి నమ్మశక్యంగా లేదా.

కానీ ఇది మాత్రం నిజం.

వినడానికే ఆశ్చర్యకరంగా ఉన్న అంతటి మహా అద్భుతం ఎక్కడ జరిగిందో తెలుసుకుందామా.తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఉన్న శ్రీ సీతారాస్వామి దేవాలయంలో ఉన్న నంద దీపం కొన్నేళ్లుగా నిత్యం వెలుగుతూనే ఉంటుందట.

ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే.ఈ ఆలయాన్ని దాదాపు 1314 సంవత్సరంలో కాకతీయుల కాలంలో చివరి రాజైన ప్రతాప రుద్రుడు గంభీరావు పేట మండల కేంద్రంలో కట్టించినట్లు గుడిపై చెక్కిన అంకెల ఆధారంగా గుర్తించడం జరిగింది.

అప్పటి గుడి నిర్మాణ సమయంలో వెలిగించిన నంద దీపం ఈరోజుకు అలానే నిత్యం వెలుగుతూనే ఉంది.ఈ నంద దీపం కారణంగానే అక్కడి ప్రజలు సుఖ సంతోషాతో ఉంటున్నారని భక్తుల ప్రగాఢ నమ్మకం.

ఆలయ నిర్మాణ సమయంలో వెలిగించిన దీపాన్ని నిరంతరం వెలిగించడానికి అప్పటి రాజులు ప్రజల నుంచి వసూలు చేసిన కొంత పన్నులోని డబ్బులను దీపపు నూనె కోసం వాడేవారని చరిత్ర చెబుతోంది.రాజుల కాలం అంతరించిపోయిన తర్వాత గంభీరావుపేటకు చెందిన అయిత రాములు, ప్రమీల దంపతులు జీవితకాలం పాటు నూనెను అందిస్తామని హామీ ఇచ్చారు.

వారు ఇచ్చిన మాట ప్రకారం వారు అందిస్తున్న నూనెతో ఇప్పటికీ నంద దీపం వెలుగుతోంది.ఇంతటి మహత్యం ఉన్న ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.

అప్పుడే గుడితో పాటు నంద దీపాన్ని చూసేందుకు భక్తులు కూడా అధిక సంఖ్యలో ఆలయానికి వస్తుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube