కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం( Mudragada Padmanabham ) మళ్లీ మనసు మార్చుకున్నట్టుగా కనిపిస్తున్నారు.గత టీడీపీ ( TDP ) ప్రభుత్వం హయాంలో కాపు ఉద్యమాన్ని మొదలుపెట్టి పెద్ద సంచలనమే సృష్టించారు.
ఆ ఉద్యమాన్ని అణిచివేసేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసింది.ఆ సమయంలోనే ముద్రగడ కుటుంబం వేధింపులకు గురైంది.
ఇక అప్పటి నుంచి టిడిపి పైన, చంద్రబాబు పైన తీవ్ర విమర్శలతో విడుచుకుపడుతూ వస్తున్న ముద్రగడ వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతూ వచ్చింది.దీనికి తగ్గట్లుగానే ఆయన స్టేట్మెంట్లు ఉండడం, ముద్రగడ అనేక సమస్యలపై ఏపీ ప్రభుత్వానికి లేఖలు రాయడం, దానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం తదితర పరిణామాలతో ముద్రగడ పద్మనాభం వైసిపిలో( YCP ) చేరడం ఖాయమని అంతా భావించారు.
ఇటీవల ముద్రగడ తాను వైసీపీలో చేరడం లేదని క్లారిటీ ఇచ్చారు.దీంతో జనసేన పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం జరిగింది.
స్వయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ముద్రగడ పద్మనాభం నివాసానికి వెళ్లి ఆయనను పార్టీలోకి ఆహ్వానిస్తారని జనసేన వర్గాలు కూడా పేర్కొన్నాయి.అయితే అది జరగకుండానే ముద్రగడ మనసు మార్చుకున్నట్లుగా కొన్ని సంకేతాలు వెలబడుతున్నాయి.

జనసేనలో చేరేందుకు ముద్రగడతో పాటు ఆయన కుమారుడు సిద్ధమైనా, సీటు విషయంలో సరైన క్లారిటీ లేకపోవడం, ఇదే విషయంపై పవన్ కళ్యాణ్ ను ముద్రగడ ప్రశ్నించగా… చంద్రబాబు నుంచి క్లారిటీ వచ్చిన తర్వాత చెబుతానని ముద్రగడకు చెప్పారట.సీఎం పదవి విషయంలోనూ పవన్ ను ముద్రగడ ప్రశించారట.ముఖ్యంగా పవన్ కు ముఖ్యమంత్రి పదవి విషయంలో ముద్రగడ క్లారిటీ కోరగా.చంద్రబాబు నుంచి స్పష్టమైన హామీ రాలేదని, ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతామని, సీఎం పదవి షేరింగ్ విషయంలో ఇంకా ఏ క్లారిటీ లేదని చెప్పడంపై ముద్రగడ అసంతృప్తి చెందారని టిడిపి, జనసేన ( TDP, Jana Sena )పొత్తు ధర్మం ప్రకారం కాపులంతా ఐక్యంగా పనిచేసే టిడిపి అభ్యర్థులకు సహకరించాల్సి ఉంటుందని పవన్ చెప్పారట.
అయితే గెలిచిన తర్వాత కాపులకు అధికారం లేకుండా చంద్రబాబుకే దక్కాలంటే అందుకు తాను సిద్ధంగా లేనని ముద్రగడ తేల్చి చెప్పారట.

సీటు విషయంలోను, సీఎం పదవి విషయంలోనూ అన్నిటికీ చంద్రబాబు పై ఆధారపడితే అసలు పార్టీ ఎందుకని పవన్ ముద్రగడ ను ప్రశ్నించినట్లుగా ప్రచారం జరుగుతుంది.అయితే ఈ విషయంలో అధికారికంగా ఏ క్లారిటీ లేకపోయినప్పటికీ, జనసేనలో చేరే విషయంలో ముద్రగడ ఇంకా ఆలోచనలోనే ఉన్నారని, జనసేన లో చేరినా టీడీపి అధినేత చంద్రబాబు కనుసన్నల్లోనే పనిచేయాల్సి ఉంటుందని, అందుకే ముద్రగడ జనసేన లో చేరే విషయంలో ఇంకా ఏ నిర్ణయానికి రాలేనట్టుగా ముద్రగడ అనుచరులు కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.