మెగా ఛాన్స్ కొట్టేసిన గబ్బర్ సింగ్ డైరెక్టర్

టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్‌తో గబ్బర్‌సింగ్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు హరీష్ శంకర్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో అందరికీ తెలిసిందే.ఆ తరువాత డీజే, గద్దలకొండ గణేష్ వంటి సినిమాలతో మెగా హీరోలకు సక్సెస్ అందించిన ఈ డైరెక్టర్‌కు మెగా ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

 Harish Shankar To Narrate Script To Chiranjeevi-TeluguStop.com

గతంలో పవర్ స్టార్‌తో సినిమా చేసిన హరీష్ శంకర్, ఈసారి ఏకంగా మెగాస్టార్‌తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట.

ఇటీవల మెగాస్టార్ చిరంజీవిని కలిసిన హరీష్ శంకర్, ఓ స్టోరీలైన్ వినిపించాడట.

కాగా చిరు ఆ కథను పూర్తి స్క్రిప్టుగా వినిపించాలని కోరాడట.దీంతో హరీష్ శంకర్ ప్రస్తుతం ఆ స్క్రిప్టును పూర్తి చేసే పనిలో పడ్డాడు.

ఇక ఈ స్క్రిప్టుకు చిరు ఓకే అంటే మాత్రం హరీష్ శంకర్ సంతోషానికి అవధులు లేకుండా పోతాయి.మెగాస్టార్‌తో సినిమా అంటే మామూలుగా ఉండదని అంటున్నారు మెగా ఫ్యాన్స్.

అయితే ప్రస్తుతం చిరు తన 152వ చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఈ సినిమాపై మాత్రమే తన ఫోకస్ ఉందని చిరు అన్నారు.తన నెక్ట్స్ మూవీని కూడా హడావుడిగా ప్రారంభించాలని లేదని చిరు సన్నిహితులకు చెప్పినట్లు తెలుస్తోంది.మరి హరీష్ శంకర్‌ మెగాస్టార్‌తో సినిమా చేసే ఛాన్స్ కొడతాడా లేదా అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube