హ్యాప్తీ బర్త్‌డే టీజర్‌ విడుదల

మత్తువదలరా’ చిత్రంతో దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్న రితేష్‌రానా దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘హ్యాప్తీ బర్త్‌డే’.లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రా న్నిక్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ మైత్రీమూవీ మేకర్స్‌ సంస్థతో కలిసి నిర్మిస్తోంది.

 'happy Birthday' Teaser Out , Lavanya Tripati, Naresh Agastya, Satya, Vennela Ki-TeluguStop.com

నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.నరేష్‌ ఆగస్త్య, సత్య,వెన్నెల కిషోర్‌,గుండు సుదర్శన్‌, తదితరులు ముఖ్యపాత్రలో నటిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం జూలై 15న విడుదల కానుంది.తొలినుంచి ఈ చిత్రం ప్రచార చిత్రాలతో ఆకట్టుకున్న ఈ చిత్రబృందం మంగళవారం చిత్రం టీజర్‌ను విడుదల చేసింది.

వినూత్నంగా, పూ ర్తి కామెడీ ప్రధానంగా వున్న ఈ టీజర్‌ అందరిని ఇంప్రెస్‌ చేసింది.యూనియన్‌ మినిష్టర్‌ రోల్‌గా వెన్నెల కిషోర్‌ సంభాషణలు, గన్‌బిల్లును ఆమోదించడం, ఇంటికొక గన్‌ పాలసీని ప్రతిపాదించడం, లావణ్య త్రిపాఠి పోల్‌ డ్యాన్స్‌ , సత్య స్టయిలిష్‌ వాక్‌, వంటి సన్నివేశాలు టీజర్‌లో ఎంతో వినోదాత్మకంగా కనిపించి చిత్రంపై అంచనాలు పెంచాయి.

కాలభైరవ తన నేపథ్య సంగీతం, సురేష్‌ సారంగం కెమెరాపనితనం టీజర్‌ను మరింత ఆసక్తిగా కనిపించేలా చేశాయి.ఇది జస్ట్‌ టీజర్‌ మాత్రమే పూర్తి పార్టీ జూలై 15న అనే విధంగా అందరిలోనూ క్యూరియాసిటి పెరిగింది.

ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ, ప్రొడక్షన్‌ డిజైనర్‌: నార్ని శ్రీనివాస్‌, ఫైట్స్‌: శంకర్‌ ఉయ్యాలా, లైన్‌ ప్రొడ్యూసర్‌: అలేఖ్య పెదమల్లు, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: బాబాసాయి, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: బాల సుబ్రమణ్యం కెవీవీ

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube