అంగన్వాడీలు సమ్మెను విరమించి విధుల్లో చేరాలని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.అంగన్వాడీలతో ప్రభుత్వం చర్చలు జరిపిందని తెలిపారు.
గౌరవ వేతనం తెలంగాణ కంటే ఎక్కువగా ఇవ్వాలని కోరారని మంత్రి బొత్స పేర్కొన్నారు.ప్రమోషన్లు ఇవ్వాలని అంగన్వాడీలు అడిగారన్న మంత్రి బొత్స అంగన్వాడీలకు తమ ప్రభుత్వం వ్యతిరేకం కాదని చెప్పారు.
అంగన్వాడీల డిమాండ్లపై సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారని తెలిపారు.సీఎం జగన్ మహిళా పక్షపాతి అని చెప్పారు.
గుజరాత్ లో తప్ప ఏ రాష్ట్రంలోనూ అంగన్వాడీలకు గ్రాట్యుటీ లేదన్న ఆయన గ్రాట్యుటీలో కేంద్ర ప్రభుత్వానికి 50 శాతం వాటా అని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో గ్రాట్యుటీ విషయంపై కేంద్రానికి లేఖ రాయనున్నామని తెలిపారు.