యూఏఈ నుంచీ భారత్ వచ్చే ఎన్నారైలకు గుడ్ న్యూస్..!!!

ప్రపంచ నలుమూలల నుంచీ విదేశాలకు ఎంతో మంది ఉద్యోగాల కోసం వలసలు వెళ్తూ ఉంటారు.ఈ వలసలలో అరబ్బు దేశాలకు వెళ్ళే వారి శాతమే ఎక్కువగా ఉంటుంది.

 Good News For Nris Coming To India From Uae , India From Uae, Nri, Dubai , Delh-TeluguStop.com

వివిధ రంగాలలో చేతి వృత్తుల వారు, చిన్న చిన్న పనులు చేసుకునే వారు, కాపలాదారులుగా, ఇలా ఎంతో మంది కార్మికులుగా ఈ అరబ్బు దేశాలకు వలసలు వెళ్తుంటారు.అయితే ఈ దేశాలకు వలస కార్మికులుగా వెళ్ళే వారిలో భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.

కుటుంబాలకు దూరంగా ఏళ్ళ తరబడి అక్కడే ఉంటుంటారు కూడా.తమ కుటుంబ సభ్యులను చూసుకోవడానికి సొంత దేశానికి వెళ్లి రావాలంటే ప్రయాణ ఖర్చులు తలకు మించిన భారంగా ఉంటాయి.

దాంతో టిక్కెట్ల రేట్లకు భయపడి సొంత ప్రాంతాలకు వెళ్ళకుండా ప్రయాణాలు వాయిదాలు వేసుకునే వారు ఎంతో మంది ఉంటారు.అలాంటి వారందరికీ గుడ్ న్యూస్ తెలిపాయి విమానయాన సంస్థలు.

ప్రస్తుతం టిక్కెట్ల ధరలు చుక్కలు చూపుతున్న నేపధ్యంలో యూఏఈ నుంచీ భారత్ వెళ్ళాలనుకునే వారు ఈ నెలాఖరు వరకూ ఓపిక పడితే సగానికి సగం ధరలు తగ్గనున్నాయని తెలుస్తోంది.బుకింగ్ ఏజెన్సీలు సైతం ఇదే మాట చెప్తున్నాయి.అబుదాబి నుంచీ బెంగుళూరుకు ప్రస్తుత టిక్కెట్టు ధర రూ.43 వేల నుంచీ రూ.86 వేలుగా ఉండగా ఈ నెలాఖరున ఇవే చార్జీలు సగానికి తగ్గనున్నాయి అంటే రూ.13 నుంచీ 15 వేల మధ్యలో ఉండనున్నాయట.అలాగే.

దుబాయ్ నుంచీ ఢిల్లీ , ముంబై లకు వెళ్ళే విమాన ఖర్చులు ప్రస్తుతం రూ.45 వేల నుంచీ 70 వేలుగా ఉండగా ఇవే చార్జీలు నెలాఖరు సమయానికి రూ.9 వేల నుంచీ రూ.11 వేల మధ్య వరకూ ఉండనున్నాయట.ఈ స్థాయిలో భారీ తగ్గింపు గతంలో ఎన్నడూ లేదని అంటున్నారు నిపుణులు.

కాగా సొంత వారిని చూసుకోవడానికి యూఏఈ నుంచీ భారత్ వెళ్లాలనుకునే వారు ఇంకో 20 రోజులు ఆగడం మంచిదని సలహా ఇస్తున్నారు నిపుణులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube