ఆ మేక ధర అక్షరాలా రూ.70 లక్షలు!

ఏంటి ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమేనండి.“నా మేక ధ‌ర అక్ష‌రాలా రూ.70 ల‌క్ష‌లు.అంత‌కు మించి ఒక్క రూపాయి కూడా తగ్గించను!” అని బేరం పెట్టాడు ఆ మేక యజమాని.ఈ మేక‌ను మ‌ధ్య‌ప్ర‌దేశ్ అనుప్పూర్ కు చెందిన ‘వాహిద్ హుస్సేన్‘ అనే వ్య‌క్తి మార్కెట్లో అమ్మేందుకు తీసుకొచ్చి, రూ.70 ల‌క్ష‌ల ధ‌ర‌ను నిర్ణ‌యంచాడు.అయితే అంత ప్రత్యేకత అందులో ఏముందనేగా మీ అనుమానం.దానికి అనేక కారణాలు చెబుతున్నాడు ఆ యజమాని.ఆ మేక ప్ర‌కృతి ఇచ్చిన వార ప్ర‌సాదం అని చెబుతున్నాడు.అలాగే ఇది స్వ‌దేశీ జాతికి చెందిన‌ది.

 The Price Of That Goat Is Literally Rs.70 Lakhs , Goat, Viral Latest, News Vira-TeluguStop.com

ఇక దీని శ‌రీరంపై ఉర్దూలో ‘అల్లా, మ‌హ‌మ్మ‌ద్’ అని రాసి వుండటమే దీని ప్రత్యేకత అట.

ఆ కారణం చేత దీని ధ‌ర‌ను రూ.70 ల‌క్ష‌లుగా ఫైన‌ల్ చేశాన‌ని ఆ యజమాని చెబుతున్నాడు.ఈ మేక ఫొటోని సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన తరువాత నాగ‌పూర్‌కు చెందిన ఓ వ్య‌క్తి ఫోన్ చేసి దీనిని రూ.22 ల‌క్ష‌ల‌కు కొనుగోలు చేస్తాన‌ని అన్నారట.అయితే దానికి అతగాడు ఒప్పుకోలేదట.

ఆ ఖ‌రీదుకు నేను మేక‌ను ఇవ్వనని, 70 లక్షలకు అణాపైసా కూడా తగ్గేది లేదని ఆ యజమాని ఎక్కడా తగ్గట్లేదు.అతగాడు దానికి ఎంతో విలువైన ఆహారం రోజూ తినబెడుతున్నాడట.

జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా..

వగైరా తినిపిస్తున్నాడట.

Telugu Lakhs, Goat, Madhyapradesh, Latest, Wahid Hussain-Latest News - Telugu

అయితే అంత ప్రత్యేకత కలిగిన మేకను ఎందుకు అమ్మేసుకోవడం అని కొంతమంది ప్రశ్నించగా, “ప్ర‌స్తుతం నా కుటుంబ ఆర్థిక ప‌రిస్థితులు ఏమి బాలేదు.నాకు మొత్తం 6గురు పిల్ల‌లున్నారు.వారిలో ముగ్గురు ఆడ పిల్ల‌లున్నారు.

ఈ మేక‌ను అమ్మిన డ‌బ్బుతోనే నేను వారి పెళ్లిళ్లు చేయాలి.నాకు వేరే దిక్కు లేదు.” అని చెప్పుకొచ్చాడట.ఇదే వింత అనుకుంటే.

మధ్యప్రదేశ్​.అగర్ మాల్వా మార్కెట్లో రూ.11 లక్షల విలువైన మేక అమ్మకానికి వచ్చింది.దీని ప్రత్యేకత కూడా అలాగే వుంది.

వాటి శరీరంపై అల్లా, మహమ్మద్ అనే ఉర్దూ పేర్ల గుర్తులు ఉండటమే వాటికి అంత డిమాండ్.వీటికి ఇంత డిమాండ్ ఉండటంతో ఈ మేకలను చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube