ఆ మేక ధర అక్షరాలా రూ.70 లక్షలు!

ఏంటి ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమేనండి."నా మేక ధ‌ర అక్ష‌రాలా రూ.

70 ల‌క్ష‌లు.అంత‌కు మించి ఒక్క రూపాయి కూడా తగ్గించను!" అని బేరం పెట్టాడు ఆ మేక యజమాని.

ఈ మేక‌ను మ‌ధ్య‌ప్ర‌దేశ్ అనుప్పూర్ కు చెందిన 'వాహిద్ హుస్సేన్' అనే వ్య‌క్తి మార్కెట్లో అమ్మేందుకు తీసుకొచ్చి, రూ.

70 ల‌క్ష‌ల ధ‌ర‌ను నిర్ణ‌యంచాడు.అయితే అంత ప్రత్యేకత అందులో ఏముందనేగా మీ అనుమానం.

దానికి అనేక కారణాలు చెబుతున్నాడు ఆ యజమాని.ఆ మేక ప్ర‌కృతి ఇచ్చిన వార ప్ర‌సాదం అని చెబుతున్నాడు.

అలాగే ఇది స్వ‌దేశీ జాతికి చెందిన‌ది.ఇక దీని శ‌రీరంపై ఉర్దూలో 'అల్లా, మ‌హ‌మ్మ‌ద్' అని రాసి వుండటమే దీని ప్రత్యేకత అట.

ఆ కారణం చేత దీని ధ‌ర‌ను రూ.70 ల‌క్ష‌లుగా ఫైన‌ల్ చేశాన‌ని ఆ యజమాని చెబుతున్నాడు.

ఈ మేక ఫొటోని సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన తరువాత నాగ‌పూర్‌కు చెందిన ఓ వ్య‌క్తి ఫోన్ చేసి దీనిని రూ.

22 ల‌క్ష‌ల‌కు కొనుగోలు చేస్తాన‌ని అన్నారట.అయితే దానికి అతగాడు ఒప్పుకోలేదట.

ఆ ఖ‌రీదుకు నేను మేక‌ను ఇవ్వనని, 70 లక్షలకు అణాపైసా కూడా తగ్గేది లేదని ఆ యజమాని ఎక్కడా తగ్గట్లేదు.

అతగాడు దానికి ఎంతో విలువైన ఆహారం రోజూ తినబెడుతున్నాడట.జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా.

వగైరా తినిపిస్తున్నాడట. """/" / అయితే అంత ప్రత్యేకత కలిగిన మేకను ఎందుకు అమ్మేసుకోవడం అని కొంతమంది ప్రశ్నించగా, "ప్ర‌స్తుతం నా కుటుంబ ఆర్థిక ప‌రిస్థితులు ఏమి బాలేదు.

నాకు మొత్తం 6గురు పిల్ల‌లున్నారు.వారిలో ముగ్గురు ఆడ పిల్ల‌లున్నారు.

ఈ మేక‌ను అమ్మిన డ‌బ్బుతోనే నేను వారి పెళ్లిళ్లు చేయాలి.నాకు వేరే దిక్కు లేదు.

" అని చెప్పుకొచ్చాడట.ఇదే వింత అనుకుంటే.

మధ్యప్రదేశ్​.అగర్ మాల్వా మార్కెట్లో రూ.

11 లక్షల విలువైన మేక అమ్మకానికి వచ్చింది.దీని ప్రత్యేకత కూడా అలాగే వుంది.

వాటి శరీరంపై అల్లా, మహమ్మద్ అనే ఉర్దూ పేర్ల గుర్తులు ఉండటమే వాటికి అంత డిమాండ్.

వీటికి ఇంత డిమాండ్ ఉండటంతో ఈ మేకలను చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు.

తెలుగు ప్రేక్షకులు బకరాలు అనుకుంటున్నారా.. విజయ్ “గోట్” సినిమా ఏం చెప్తుంది?