వలస కార్మికులకు వరించిన అదృష్టం.. లాటరీలో కోట్లు!

వారిద్దరూ పొట్ట కూటి కోసం దేశం కాని దేశం వెళ్లారు.రోజూ ఒళ్లు హూనం అయ్యేలా కష్టపడుతూ ఇంటికి డబ్బులు పంపుతున్నారు.

 Good Luck To Migrant Workers Quotes In The Lottery , Lottery , Viral Latest , N-TeluguStop.com

అయితే తమకు అదృష్టం లభిస్తుందేమోనని అనుకోకుండా లాటరీ టికెట్ కొన్నారు.దీంతో వారి దశ తిరిగింది.రాత్రికిరాత్రే ఇద్దరు భారతీయ వలస కార్మికులు కోటీశ్వరులయ్యారు.తాము కొన్న టికెట్‌కు లాటరీ దొరికిందని తెలుసుకుని, ఆశ్చర్యపోయారు.తమ కళ్లను తామే నమ్మలేకపోయారు.అయితే తమకు నిజంగానే లాటరీ తగిలిందని తెలుసుకుని సంతోషంలో మునిగిపోయారు.

కోటీశ్వరులు కావడంతో తమ కష్టాలన్నీ తీరిపోయాయని తెలుసుకుని, విషయాన్ని కుటుంబ సభ్యులతో పంచుకున్నారు.ఈ ఆసక్తిక అంశానికి సంబంధించిన విషయాలిలా ఉన్నాయి.

దుబయ్ ఎయిర్‌పోర్టులో లాటరీ ఉంటుంది.దీనిని సందర్శించిన వారు ఈ దుబయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియమ్ మిలియనీర్ అనే పేరున్న లాటరీ టికెట్ కొనేందుకు ఆసక్తి చూపుతారు.ఇందులో విజేతలుగా నిలిచిన వారికి ఒక మిలియన్ అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.7.7 కోట్లు) లభిస్తాయి.ఒక్కసారిగా వారికి పట్టిన కష్టాలన్నీ పోతాయి.

తాజాగా దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ డ్రాలో ఇద్దరు భారతీయులకు ఒక మిలియన్ లాటరీ తగిలింది.యూఏఈలో ఉంటున్న కేరళకు చెందిన రాహుల్ రమణన్ ఏప్రిల్ 30న ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన తన లక్కీ టిక్కెట్ నంబర్ 0595తో మిలీనియం మిలియనీర్ సిరీస్ 389లో ఒక మిలియన్ లాటరీ గెలుచుకున్నాడు.

అబుదాబిలో ఉన్న మరో కేరళ వ్యక్తి జాన్సన్ జాకబ్ ఈ మిలీనియంలో ఒక మిలియన్ డాలర్ల లాటరీ దక్కించుకున్నాడు.అతడి టికెట్ నంబర్ 4059కు తాజా లాటరీ తగిలింది.

అతడు మే 13న ఆన్‌లైన్‌లో కొనుగోలు చేశాడు.ఇక ఎప్పుడు ఆ డ్రా తీసినా చాలా మంది భారతీయులకు లాటరీ తగులుతోంది.

ఎంతో మంది పొట్ట కూటి కోసం అరబ్ దేశాలకు వలస వెళ్లిన వారిని అదృష్టం లాటరీ రూపంలో వరిస్తోంది.వారి కష్టాలు ఒక్కసారిగా తీరిపోతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube