మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక ‘గాడ్ ఫాదర్’ చిత్రం కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్త నిర్మాణంలో మోహన్ రాజా దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది.బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ చిత్రంతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు.
ప్రస్తుతం ముంబై లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం నుండి బ్లాస్టింగ్ న్యూస్ వచ్చింది.ఈ చిత్రంలో ఇద్దరు మెగాస్టార్లకు ఫ్యాన్స్ ని ఉర్రూతలూగించే ఓ బాంబింగ్ సాంగ్ వుంది.
ఈ స్పెషల్ డ్యాన్స్ నంబర్ కు ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా కొరియోగ్రఫీ చేస్తున్నారు.ఈ పాట చిత్రీకరణకు సంబధించిన ఒక ఫోటోని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు మెగాస్టార్ చిరంజీవి.
‘గాడ్‌ఫాదర్ కోసం భాయ్ సల్మాన్ తో కలిసి డ్యాన్స్ చేశా.ప్రభుదేవా కొరియోగ్రఫీ వండర్ ఫుల్.
ఈ పాట అభిమానులకు ఖచ్చితంగా కన్నుల పండగ’ అని ట్వీట్ చేశారు మెగాస్టార్.
ఈ చిత్రంలో టాప్ హీరోయిన్ నయనతార కీలక పాత్రలో నటిస్తుండగా, స్టార్ దర్శకుడు పూరి జగన్నాధ్ అతిధి పాత్రలో కనిపించనున్నారు.
సత్యదేవ్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.టాప్ టెక్నికల్ టీమ్ గాడ్ ఫాదర్ కోసం పని చేస్తున్నారు.వెటరన్ సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందిస్తుండగా, సంగీత సంచలనం ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ సమకూరుస్తున్నారు.అనేక బాలీవుడ్ హిట్ చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసిన సురేష్ సెల్వరాజన్ ఈ చిత్రానికి ఆర్ట్‌వర్క్ అందిస్తున్నారు.
ఆర్‌బి చౌదరి, ఎన్వీ ప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల సురేఖ సమర్పిస్తున్నారు.