మరో 20 రోజుల్లో తెలంగాణాలో జరగబొయ్యే అసెంబ్లీ ఎన్నికలకు( assembly elections ) సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ నిన్నటితో ముగిసింది.ఇక రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు అయినా బీఆర్ఎస్, కాంగ్రెస్ ( BRS, Congress )మరియు బీజేపీ పార్టీలు ఎన్నికల ప్రచారం వేగవంతం చేసింది.
తమ పార్టీ కి సంబంధించిన మేనిఫెస్టో ని జనాల్లోకి తీసుకుని వెళ్లే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు.కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలు ఢిల్లీ నుండి వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ( Narendra Modi ) రెండు సార్లు హైదరాబాద్ లో భారీ భారంగా సభలు వారం గ్యాప్ లో నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే.దీనిని బట్టీ అర్థం చేసుకోవచ్చు ఈ ఎన్నికలను అన్నీ పార్టీలు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అనేది.
ఇకపోతే సామాన్య పౌరులకు తరచూ ఉపయోగించుకునే వస్తువుల పై కాంగ్రెస్ మరియు బీఆర్ ఎస్ పార్టీలు వరాల జల్లు కురిసిపిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
మన నిత్య జీవితం లో వంట గ్యాస్ ( Cooking gas )ఒక్క అవసరం ఎంత ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.ఈ వంట గ్యాసు ని కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తే 500 రూపాయలకే అందచేస్తామని ప్రకటించింది.ఇక బీఆర్ఎస్ పార్టీ అయితే కేవలం 400 రూపాయలకు వంట గ్యాస్ పంపిణీ చేస్తామని ముందుకొచ్చింది.
ప్రస్తుతం తెలంగాణ లో గ్యాస్ సిలిండర్( cylinder ) రేట్ 955 రూపాయిలు.బీఆర్ఎస్ పార్టీ అధికారం లో ఉన్నప్పుడే ఈ రేంజ్ లో ధరలు విక్రయిస్తున్నారు.
అధికారం లో ఉన్నప్పుడే చేసిందేమి లేదు కానీ, మళ్ళీ అధికారం లోకి వస్తే 400 కి ఇచ్చేస్తారట.ఈ మోసపూరిత పార్టీ మాటలను నమ్మి జనాలు మోసపోకండి అంటూ ఒక పక్క కాంగ్రెస్ పార్టీ తిప్పి కొడుతోంది.
అలా తెలంగాణ లో గ్యాస్ సిలిండర్ పై హామీ పెద్ద చర్చకు దారి తీసింది.అలాంటి ఈ సమయం లో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ మరో సంచలన ప్రకటన చేసింది.
ఫార్వర్డ్ బ్లాక్ సనత్ నగర్ ప్రాంత ఎమ్యెల్యే అభ్యర్థి కుమ్మరి వెంకటేష్( kummari venkatesh ) ఎన్నికల ప్రచారం లో భాగంగా మాట్లాడుతూ, ఒక్క రూపాయికే గ్యాస్ సిలిండెర్ ని అందచేస్తామని ఈ సందర్భంగా తెలిపాడు.ఇదొక్కటే కాదు ఒక్క రూపాయికే విద్య, ఒక్క రూపాయికే వైద్యం కూడా అందేలా చేస్తాము అంటూ హామీల మీద హామీలు జారీ చేసారు.ప్రతీ వంద కుటుంబాలకు ఒక వాలంటీర్ ని ఏర్పాటు చేసి ఒక్క పానిక్ బటన్ నొక్కగానే కావాల్సిన అవసరాలను తీరుస్తాము అంటూ కుమ్మరి వెంకటేష్ ఈ సందర్భంగా తెలిపాడు.