జమ్మూకశ్మీర్ ( Jammu and Kashmir )లో పడవ ప్రమాదం చోటు చేసుకుంది.శ్రీ నగర్ సమీపంలో జీలం నదిలో ప్రమాదవశాత్తు పడవ బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడగా.పలువురు గల్లంతు అయ్యారు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు.ఇందులో భాగంగా గల్లంతైన వారి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.
అయితే ఘటన చోటు చేసుకున్న సమయంలో పడవలో 12 మంది విద్యార్థులు ఉన్నారని తెలుస్తోంది.విద్యార్థులంతా గాంద్ బల్ నుంచి బట్వారాకు వెళ్తున్నారు.
గత కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జీలం నదికి వరద పోటెత్తిందని, ఈ క్రమంలోనే పడవ ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు.