నెల్లూరు: మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎవరితో పొత్తు పెట్టుకుoటారో.
ఎవరిని పెళ్లి చేసుకుంటారో.మాకు అనవసరం.
సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి చూసి వాళ్ళకి భయం పట్టుకుంది.వాళ్ల మీద వాళ్ళకి వ్యక్తిగతంగా నమ్మకం లేక అందరూ ఒకటవ్వాలని కోరుకుoటున్నారు.
దీన్ని బట్టి అర్థమవుతోంది రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ఎంత బలంగా ఉన్నారో.నేను అనారోగ్య సమస్యల వల్ల ఇంకా గడపగడపకు ఎమ్మెల్యే ప్రోగ్రాంని స్టార్ట్ చేయలేదు.
రెండున్నర ఏళ్ల క్రితం NRC ఇష్యూ సందర్భంగా జరిగిన పాత వీడియోను తీసుకొచ్చి గడపగడపకు ఎమ్మెల్యే కార్యక్రమంలో అనిల్ ముస్లింలు తరిమికొట్టారని టిడిపి జనసేన అబద్ధపు ప్రచారం చేస్తోంది.
బీజేపీకి తొత్తు జనసేన.
జనసేన తో కలవాల నుకుంటుంది టిడిపి.ఈ మూడు ఒక కూటమి.
ఈ కూటమి ముస్లింల నుంచి వైసీపీని వేరు చేయాలని చూస్తోంది.టెన్త్ పేపర్ లీకేజీలో ఒకరు అప్రూవర్గా మారి ఇచ్చారు కాబట్టి కేసు కట్టారు.
కేసు కడితే కక్షసాధింపు ఎలా అవుతుంది.గుంటూరులో రేప్ చేసింది టిడిపి కార్యకర్త కాదా.ఇంకో జన్మ ఎత్తినా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాలేడు.75 ఏళ్ళ వయసులో వచ్చి చంద్రబాబు రాష్ట్రాన్ని ఏం ఉద్ధరిస్తాడు.