యువత భవితను జనసేన పార్టీలో పాతి పెడుతున్నారు - కేతంరెడ్డి వినోద్ రెడ్డి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు చాలా ఆనందంగా ఉంది.పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆహ్వానం మేరకు పార్టీలో చేరాను.

 Former Janasena Leader Kethamreddy Vinod Reddy Joins Ysrcp Party Details, Janase-TeluguStop.com

పార్టీలో చేరిక సందర్భంగా తమ ఆశీస్సులు అందించిన ఎంపీలు విజయసాయిరెడ్డి గారు, మద్దిల గురుమూర్తి గారు, మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిలకు ధన్యవాదాలు.ముఖ్యంగా రాజకీయాల్లో నా కష్టాన్ని గుర్తించిన మంత్రి కాకాణి గారి మాటలు ఎంతో ఆనందాన్ని కలిగించాయి.

పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో సాన్నిహిత్యం ఇప్పటిది కాదు.కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం ఆయన వద్ద రాజకీయ సలహాదారునిగా ఉన్నాననే విషయం జిల్లాలో అందరికీ తెలుసు.

వారు రాజ్యసభ సభ్యులు అయిన తరువాత వైసీపీలో చేరాలనే ఆహ్వానం ఉన్నప్పటికీ ఆనాడు నేడు యువతకు ప్రాధాన్యత ఇస్తామన్న పవన్ కళ్యాణ్ గారి మాటల పట్ల ఆకర్షితుడినై జనసేన పార్టీలో చేరాను.తర్వాత నేనెలా పనిచేసానో, ఎన్ని కష్టాలు పడ్డానో, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నానో అందరికీ తెలిసిన విషయమే.

వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రాకముందు నుండే ప్రజాసేవ చేస్తూ ఉన్నారు.విపిఆర్ ఫౌండేషన్ ద్వారా నాణ్యమైన విద్య, వైద్యం, స్వచ్ఛమైన త్రాగునీరు మరియు ఇతర సేవా కార్యక్రమాలతో ప్రజలకు తోడుగా నిలిచారు.

జిల్లాలో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను సైతం నిర్వహించారు.రాజ్యసభ ఎంపీగా కూడా జిల్లాలో చెరగని ముద్ర వేశారు.

కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చారు.ఎంపీ ల్యాడ్స్ నిధులతో పాటు తమ స్వంత నిధులను కూడా జిల్లాలో అభివృద్ధికి వెచ్చిస్తున్నారు.

వారు నెల్లూరు ప్రజలకు చేసిన సేవలే రానున్న ఎన్నికల్లో ఆయన్ని నెల్లూరు లోక్ సభ ఎంపీగా గెలిపించనున్నాయి.

జనసేన పార్టీలో కేవలం పవన్ కళ్యాణ్ అనే ఒక్క వ్యక్తి కోసమే నేను పనిచేశాను.

కానీ పార్టీలో ఆయన చుట్టూ వెధవలు ఉన్నారు.టీడీపీతో పొత్తు కూడా సెట్ కాకముందే నన్ను పిలిచి నెల్లూరులో నారాయణ పోటీ చేస్తున్నారు, నేను ఆయనకు పనిచేయాలి అని చెప్పారు.

నేను వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కోసం పనిచేయట్లేదు, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని తెలిపాను.గతంలో నారాయణ అక్రమాల మీద తీవ్రంగా పోరాడాను.2016లో 1150 కోట్ల హడ్కో ఋణాన్ని నెల్లూరు నగర ప్రజల నెత్తిన రుద్ది నారాయణ అక్రమాలకు పాల్పడ్డారు.ఇప్పటికి కూడా నెల్లూరు ప్రజలు నెలకు 110 కోట్ల రూపాయలను వడ్డీ రూపంలో కడుతున్నారు.

అందుకే నగరంలో అనేక పన్నులు పెరిగాయి.

అయినప్పటికీ పార్టీ పెద్దల మాటే శిరోధార్యమని, నారాయణ కోసం పనిచేస్తానని తెలిపాను.

పార్టీలో నాకు అవమానాలు లేకుండా చూడండని కోరాను.కానీ జనసేన పార్టీలో నాకు అవమానాలు తగ్గలేదు.

నేను 2019 లో నెల్లూరు సిటీలో పోటీ చేశాను.ఎన్నికలు ముగిసి ఓడిన నాటి నుండి నేటి వరకు నేనెలా పనిచేస్తున్నానో, కష్టపడుతున్నానో అందరికీ తెలిసిన విషయమే.

కానీ ప్రక్క నియోజకవర్గంలో పోటీ చేసిన కొందరు చిల్లర వెధవలను పార్టీలో నెంబర్ టూ గా పిలవబడే నాదెండ్ల మనోహర్ ప్రోత్సహిస్తూ నిత్యం నాపై కుట్రలు చేస్తూ, పవన్ కళ్యాణ్ కు లేనిపోనివి చెప్తూ, నాకు పార్టీలో ఎలాంటి పదవులు లేకుండా చేస్తూ, శీల పరీక్షలు, శల్య పరీక్షలు చేస్తూ, పార్టీ కార్యక్రమాలకు కూడా నన్ను పిలవకుండా అవమానాలు చేస్తూనే ఉన్నేరు.

Telugu Cm Jagan, Janasena, Nellore, Pawan Kalyan, Vemiprabhakar, Ysrcp-Latest Ne

పవన్ కళ్యాణ్ తాను ఆకాశం లాంటివాడిని చెప్తూ ఉంటారు.కానీ ఆయన నాదెండ్ల మనోహర్ అనే బ్లాక్ హోల్ ని తన ప్రక్కన కూర్చో పెట్టారు.ఈ నాదెండ్ల మనోహర్ అనే బ్లాక్ హోల్ పార్టీలో ఎవ్వరినీ ఎదగనీయదు.

రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వ్యాప్తంగా డమ్మీ కమిటీలను వేసి ఇదే జనసేన పార్టీ అంటారు.కష్టపడి పనిచేసే వారికి పార్టీలో అసలు గుర్తింపు ఉండదు.పచ్చిగా చెప్పాలంటే జనసేన పార్టీని నాదెండ్ల మనోహర్ రేప్ చేస్తున్నాడు.అంటే మానభంగం చేస్తున్నాడు.

ఆయన పార్టీని మానభంగం చేస్తున్న విషయాన్ని పార్టీలో ఎవరు కూడా పవన్ కళ్యాణ్ కు చెప్పకూడదంట.చెప్తే వారు కోవర్టులతో సమానమని స్వయంగా పవన్ కళ్యాణ్ గారే తెలిపారు.

నాకు తెలిసినంత వరకు నాదెండ్ల మనోహర్ గతంలో స్పీకర్ గా ఉన్నపుడే ఇతని భాగోతాల గురించి మా గురువు దివంగత ఆనం వివేకానందరెడ్డి గారు చెప్పారు.అప్పట్లో శాసనసభ్యులకు ఇచ్చిన శాంసంగ్ ట్యాబ్ ల దగ్గరే ఈయన చిల్లరకు కక్కుర్తిపడ్డాడు.

కాంగ్రెస్ పార్టీలో కూడా ఈయన భాగోతాలను దగ్గరగా చూసాను.నేను యూత్ కాంగ్రెస్ కి సోషల్ మీడియా ఛైర్మన్ గా, రాష్ట్ర ఇన్ ఛార్జ్ గా ఉన్న సమయంలో నాదెండ్ల మనోహర్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియా ఛైర్మన్ గా ఉండేవారు.

అప్పట్లో రాహుల్ గాంధీ టీమ్ 15మందిలో ఒకడిగా నేను పని చేయడం, పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి గారితో నాకున్న సాన్నిహిత్యం, ఆయన నన్ను ప్రోత్సహించే విధానం ఈ నాదెండ్ల మనోహర్ కు నచ్చేది కాదు.

కాంగ్రెస్ పార్టీలో నాలాంటి సామాన్యులు ఎవ్వరూ ఎదగగూడదని పనిచేసాడు.

ఇప్పుడు జనసేన పార్టీలోనూ అదేపని చేస్తున్నాడు.అందుకే రాష్ట్రంలో జనసేన పార్టీ దివాళా తీసే పరిస్థితికి చేరింది.

ఒక విధానం అంటూ లేకుండా ఏ ఎండకా గొడుగు అన్నట్టు తయారైంది.ఇప్పటివరకు జనసేన పార్టీని నాదెండ్ల మనోహర్ రేప్ చేస్తున్నాడు.

ఇప్పుడు పొత్తులో భాగంగా టీడీపీ పార్టీ రేప్ చేస్తుంది.మా నెల్లూరు సిటీలో ఇప్పటికే నారాయణ జనసేన పార్టీని రేప్ చేయడం మొదలు పెట్టాడు.

పార్టీ బలంగా ఉంటుందని చెప్పుకునే గోదావరి జిల్లాల్లో పలువురు నాయకులు పార్టీని టీడీపీ ఎలా రేప్ చేస్తుందో నాతో చెప్తూ ఆవేదన చెందుతున్నారు.

నారాయణ కోసం పనిచేస్తానని చెప్పిన తర్వాత కూడా పార్టీలో నాకు జరుగుతున్న అవమానాలు నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీశాయి.

పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలనుకున్నాను, కానీ అది నెరవేరే పరిస్థితి లేదు.ఇంక ఎందుకోసం పార్టీలో ఉండాలి అనే నైరాశ్యంలో ఉన్న సమయంలో పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఫోన్ చేసి వైసీపీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు.

పవన్ కళ్యాణ్ గారు గతంలో టీడీపీని భయంకరంగా తిట్టారు.కానీ వారికి ఇప్పుడు టీడీపీ మంచిగా కనిపించి వారితో కలిశారు.కానీ నాకు ఏ కోణంలో కూడా టీడీపీ మంచిగా కనిపించలేదు.అందుకే మంచి నిర్ణయం తీసుకుని వైసీపీలో చేరాను.

సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు నిత్యం పేద ప్రజల ఆర్ధిక అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు.పవనన్న ప్రజాబాట అంటూ నేను నగరంలో ఇంటింటికీ వెళ్లిన సమయంలో అనేక ఇళ్ళలో సీఎం జగన్ ఫోటో పెట్టుకుని ఆరాధించడం స్వయంగా చూసాను.

ప్రజలకు పింఛన్ లేదనో, రేషన్ కార్డు లేదనో, వీధి దీపాలు లేవనో, సైడు కాలువలు బాగాలేవనో, నేనేదైతే సమస్యలను సంబంధిత సచివాలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లానో అవి తక్షణం పరిష్కారమయ్యాయి.గతంలో నేను ఎక్కడైతే రోడ్లు బాగాలేవని వైసీపీ రంగులను వేసానో అక్కడ ఇప్పుడు రోడ్ల నిర్మాణం అద్భుతంగా ఉంది.

అంటే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఇక్కడ పరిష్కారం లభిస్తోంది.

వార్డు సచివాలయాలు ప్రజల మన్ననలు పొందాయి.

సమస్యల పరిష్కారం కోసం మండల ఆఫీసులు, మునిసిపల్ ఆఫీసుల చుట్టూ తిరిగే బాధలు ప్రజలకు ఇప్పుడు లేవు.రాష్ట్రం ఆర్థికంగా లోటులో ఉన్న సమయంలో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన ఒక్కో హామీని నెరవేరుస్తూ ముందుకు సాగుతున్న విధానం చాలా గొప్పది.

నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే అనేక జిల్లాల నుండి జనసేన పార్టీ నేతలు ఫోన్లు చేసి అభినందించారు.నన్ను అభినందిస్తూ వారు ఎదుర్కొంటున్న అవమానాలను పంచుకున్నారు.

ముఖ్యంగా గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రలో అనేకమంది నేతలు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారు.

నేను పార్టీని వీడాను, నాకు అవమానాలు జరిగాయని రాజీనామా పత్రంలో పొందుపరిచాను తప్పించి విమర్శించలేదు.

అయినప్పటికీ నాదెండ్ల మనోహర్ ముసుగులో పనిచేసే శతగ్ని అనే చిల్లర బ్యాచ్ సోషల్ మీడియాలో నన్ను, నా కుటుంబాన్ని టార్గెట్ చేయడం నాకు బాధ కలిగించింది.పార్టీలో కష్టపడిన వారిని గుర్తించకుండా, చిల్లర పంపించే వారి పోస్టులను పార్టీ అధికారిక పేజీలు, ట్విట్టర్ లో పెట్టడమే ఈ శతగ్ని బ్యాచ్ ప్రధాన పని.నన్ను కోవర్టు అంటూ దూషిస్తున్నారు.పార్టీలో నాలాగా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి కావాలంటూ ఎవరైనా తిరిగారా చెప్పండి.

నా నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ అంటూ స్టిక్కర్లు అంటించాను, కరపత్రాలు పంచాను.ఊరంతా సీఎం పవన్ కళ్యాణ్ అంటూ పోస్టర్లు వేసాను, పెయింటింగులు వేసాను.

ఆఖరికి సీఎం పవన్ కళ్యాణ్ అంటూ శిలాఫలకం కూడా పెట్టాను.ఒక కోవర్టు చేసే పని ఇలా ఉంటుందా చెప్పండి.

కోవర్టు అంటే ఒక పార్టీలో ఉంటూ వేరే పార్టీ కోసం పనిచేసే వారు.అంటే నాలుగేళ్ళుగా నాలాంటి వారిని నమ్మిస్తూ టీడీపీ కోసం పనిచేస్తున్న నాదెండ్ల మనోహర్ పెద్ద కోవర్టు.

నేను అమ్మడు పోయాను అంటూ పోస్టులు పెడుతున్నారు.ఇన్ని రోజులుగా ఎంతకి అమ్ముడుపోయి జనసేన పార్టీలో పనిచేసానో చెప్పండి.

నా సేన కోసం నా వంతు, 50 రూపాయల ఇన్సూరెన్స్ కి 500 రూపాయలు, జీతంలో సగం ఇవ్వండి, కౌలు రైతుల కోసం డబ్బు ఇవ్వండి అంటూ నా నియోజకవర్గం నుండి డబ్బులు దండారు తప్పించి ఇప్పటివరకు పార్టీ పరంగా నా నియోజకవర్గానికి జనసేన పార్టీ ఏమీ ఇవ్వలేదు.నెల్లూరు జిల్లాలో ఒక్క కౌలు రైతుకి కూడా లక్ష రూపాయల పరిహారం ఇవ్వలేదు.

నాకు గౌరవం, నన్ను నమ్మి నాతో ప్రయాణించే వారికి అండగా ఉండగలననే వైసీపీలో చేరాను.నారాయణ దగ్గర లేని డబ్బా చెప్పండి, నేను పార్టీ మారుతున్నాననే విషయం తెలిసిన నాటి నుండి మూడు సార్లు నా వద్దకు డబ్బు ఇస్తామంటూ మధ్యవర్తులను పంపాడు.

కేతంరెడ్డిని డబ్బుతో కొనలేరు అని వారితో చెప్పాను.నేను రెడ్డిని కాబట్టి వైసీపీలో చేరాను అంటూ పోస్టులు పెడుతున్నారు.పార్టీలో పనిచేసినన్ని రోజులు నా కులం గుర్తు రాలేదా అని అడుగుతున్నాను.జనసేన పార్టీ కాపులదా అని ప్రశ్నిస్తున్నాను.

మరైతే ఇక్కడ పెత్తనం అంతా నాదెండ్ల మనోహర్ అనే కమ్మ వ్యక్తిదే కదా.వైసీపీలో ఉండే కాపు నాయకులను మీరు పాలేర్లు అంటూ పిలుస్తారు.టీడీపీలో ఉండే కాపులు పాలేర్లు కాదా.నారాయణ అనే పాలేరు పంచన చేరారంటే మిమ్మల్ని ఏమని పిలవాలి.

రాష్ట్రంలో కాపులందరూ వైసీపీలో ఎందుకు ఉన్నారంటే, ఇక్కడ ఉంటే తాము మంచి నాయకులుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా అవ్వగలమని, జనసేన పార్టీలో ఆ భరోసా లేదనే.పాతికేళ్ళు అంటూ మభ్య పెడుతూ యువత భవితను ఇక్కడ పాతి పెడుతున్నారు.

మొదటి ఓటు వేయండి అంటారు ఎందుకంటే 2014లో, 2019లో మిమ్మల్ని నమ్మి ఓటు వేసిన వారు 2024లో వేయరు కాబట్టి యువతను సాఫ్ట్ టార్గెట్ గా మార్చుకుంటున్నారు.పాతికేళ్ళు అంటూ మాట్లాడుతున్న నాదెండ్ల మనోహర్ తెనాలిలో తనకు తానుగా సీటుని ఎందుకు ప్రకటించుకున్నాడు.

అక్కడ మునిసిపల్ ఎన్నికల్లో ఇతను నేను నిలబెట్టినంత మంది అభ్యర్థులను కూడా నిలబెట్టలేకపోయాడు.అక్కడ మాజీమంత్రి ఆలపాటి రాజేంద్ర ఇతని కంటే వంద రెట్లు నయం.

చంద్రయాన్ 1 అప్పుడు జనసేన పార్టీకి బీజాలు పడ్డాయి, ఇప్పుడు చంద్రయాన్ 3 తో మనం చంద్రుడి మీదకు కూడా చేరాం.కానీ జనసేన పార్టీలో ఎదగాలి అనుకునే వారు సూన్యం లో సున్నా చుడుతున్నారు.

దీనికి కారణం నాదెండ్ల మనోహర్.ఏమి నాదెండ్ల.

నేను అడుగుతున్నాను చెప్పు.తెనాలిలో పోటీ చేయకుండా టీడీపీకి ఇచ్చేసి నీ నిబద్ధత నిరూపించుకోగలవా.

జనసేన పార్టీలో పదవులు లేకుండా ఒక్కరోజైనా పనిచేయగలవా.నన్ను విమర్శించే వారికి ఒక్కటే చెప్తున్నా.

నేను 316 రోజులు ఏ నిబద్ధతతో అయితే పనిచేసానో అలాంటి నిబద్ధతతో ఆపకుండా కనీసం నెల రోజుల పాటు మీ నియోజకవర్గాల్లో పనిచేసి మాట్లాడండి.మీ విమర్శలను స్వాగతిస్తాను.

అంతే కానీ ఇంటర్నెట్ ఫ్రీ గా వస్తుంది కదా అని బాత్ రూమ్ లలో తలుపులు వేసుకుని సోషల్ మీడియాలో సొల్లు వాగుడు వాగితే చూస్తూ ఊరుకోను.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube