జాతీయ రాజకీయాలపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ దృష్టి సారించారు.ఈ మేరకు త్వరలోనే పార్టీ ఎంపీలతో ఆయన కీలక సమావేశం నిర్వహించనున్నారని తెలుస్తోంది.
ఇందులో ప్రధానంగా జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ పాత్రపై కేసీఆర్ చర్చించే అవకాశం ఉంది.ఈ క్రమంలోనే హైదరాబాద్ కు రావాలని పార్టీ ఎంపీలకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
పార్లమెంట్ లో నెలకొన్న పరిస్థితులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని ఎంపీలకు కేసీఆర్ సూచించారని సమాచారం.