నేడే అమావాస్య.. తెల్లజిల్లేడు చెట్టుకు ఇలా చేస్తే అదృష్టం మీ వెంటే..?

నేడు శ్రావణ మాస అమావాస్య మాత్రమే కాకుండా ఈరోజు ఎంతో అరుదైనా, ప్రత్యేకమైన రోజు అని చెప్పవచ్చు.ముఖ్యంగా ఈ అమావాస్య రోజు సూర్య భగవానుడు పుష్యమీ నక్షత్రంలో ఉండటం వల్ల ఈ అమావాస్య ఎంతో ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు.

 Follow These Pooja Tips On This Amavasya, Amavasya, Hindu Beliefs, New Moon Tips-TeluguStop.com

ఉదయం 9 గంటల 30 నిమిషాల వరకు సూర్య భగవానుడు పుష్యమి నక్షత్రంలో ఉంటాడు.ఆ తరువాత పుష్యమి నక్షత్రం నుంచి ఆశ్లేష నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు.

ఈ క్రమంలోనే సూర్యుడు పుష్యమి నక్షత్రం లో ఉన్నంత సేపు ఈ సమయం ఎంతో ప్రత్యేకమైన శుభప్రదమైనది అని చెప్పవచ్చు.ఈ నక్షత్ర సమయంలో తెల్ల జిల్లేడు చెట్టుకు ఈ విధంగా పూజ చేయటం వల్ల ప్రతి ఒక్కరికి రాజయోగం పడుతుందని పండితులు చెబుతున్నారు.

మరి అమావాస్య రోజు తెల్ల జిల్లేడు చెట్టు ఏ విధంగా పూజ చేయాలో ఇక్కడ తెలుసుకుందాం….

సూర్య భగవానుడు పుష్యమి నక్షత్రంలో ఉన్న సమయంలో తెల్ల జిల్లేడు చెట్టుకు ప్రత్యేకమైన పూజలు చేయాలి.

ఈ విధంగా తెల్లజిల్లేడు చెట్టు దగ్గరకు వెళ్లి జిల్లేడు చెట్టుకు కంకణం కట్టి చెట్టు పై పసుపు కుంకుమ చల్లాలి.అదేవిధంగా బెల్లపు నీటిని కూడా జిల్లెడు చెట్టు పై చల్లాలి.

ఈ విధంగా బెల్లపు నీళ్లు చల్లిన తరువాత జిల్లేడు చెట్టుకు ఈ విధంగా నమస్కరించాలి.ఓ వృక్షమా నీ నుంచిఓ వస్తువు తీసుకు వెళ్తున్నాను ఇది నాకు అన్ని విధాలా మంచి చేయాలని నమస్కరించి జిల్లెడు చెట్టు నుంచి చిన్న బెరడు లేదా కొమ్మను తీసుకువెళ్లాలి.

Telugu Amavasya, Devotiona, Hindu Beliefs, Moon, Pooja Tips, Surya Bhagavan, Tel

ఈ విధంగా తీసుకువెళ్లిన తెల్ల జిల్లేడు చెట్టు బెరడులో కొంత భాగాన్ని తీసుకుని దానిని వెండి లేదా ఇత్తడి లేదా పంచలోహాలతో తయారు చేసినటువంటి తాయత్తులో ఉంచి మెడలో కట్టుకోవడం వల్ల మనం అనుకున్న కార్యాలు నెరవేరడమే కాకుండా అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.ఇలా చేయటం వల్ల పెళ్లికాని వారికి పెళ్లిళ్లు జరుగుతాయని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పవచ్చు.తెల్ల జిల్లేడు చెట్టు వేరు, కాకుండా బెరడు తెచ్చుకొని ఉంటే ఆ బెరడుతో వినాయకుడిని లేదా ఆంజనేయస్వామిని తయారు చేయించుకుని మన పూజ గదిలో ఉంచి ప్రతిరోజూ పూజ చేయడం వల్ల ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవని పండితులు చెబుతున్నారు.ముఖ్యంగా తెల్ల జిల్లేడు చెట్టుకు కేవలం సూర్య భగవానుడు పుష్యమి నక్షత్రంలో ఉన్న సమయంలో మాత్రమే పూజ చేయటం వల్ల ఈ విధమైనటువంటి ఫలితాలను పొందవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube