టీమిండియా క్రికెట్ జట్టులో చెప్పుదగ్గ వారిలో కపిల్ దేవ్ కూడా ఒకరు.ఆయన గురించి తెలియని వారు ఉండరు.
ఆయన మైదానంలో ఎటువంటి టెన్షన్ లేకుండా ఎంతో ప్రశాంతంగా ఉంటారు.ఆయన ఆట తీరు చూస్తుంటే ఎవరికయినా సరే గట్టిగా విజిల్ వేయాలనిపిస్తుంది ఆయన ఆట ఎంతోమంది యువ క్రికెటర్లకు ఆయన స్ఫూర్తిదాయకం అనే చెప్పాలి.
ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా తన భావోద్వేగాలను అదుపులో ఉంచుకునే వ్యక్తి కపిల్ దేవ్ అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి.
అయితే ఈ ప్రపంచ కప్ విజేత ఇప్పుడు ఒక కొత్త అవతారంలో సందడి చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.
క్రెడిట్ కార్డుల బిల్లుల యాప్ కోసం చేసే ప్రకటన లాగా ఉంది.ఈ ప్రకటనలో కపిల్ ఒక బాలీవుడ్ నటుడిని ఇమిటేట్ చేస్తూ అందరిని అలరించాడు.ఐపీఎల్ 2021 ఫైనల్ రోజున సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది.ఈ వీడియోలో కపిల్ దేవ్ ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ బాడీ లాంగ్వేజ్ ని అనుకరించాడు.
కపిల్ దేవ్ యొక్క కొత్త రూపం చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు.

జిగేల్ జిగేల్ అంటూ మెరిసే దుస్తులు ధరించడం నుంచి ప్రత్యర్థులను స్లెడ్జింగ్ చేయడం వరకు అన్నీ రకాల కాస్ట్యూమ్స్ తో కపిల్ ఈ వీడియోలో కనిపిస్తారు.కపిల్ దేవ్ ఈ వీడియోలో రకరకాల రంగుల దుస్తులు ధరించి అభిమానులకు కన్నుల విందు చేసారు.ఏంటి కపిల్ దేవ్ ఇలా కూడా చేస్తారా.? అనే అనుమానాన్ని కలిగించాడు అభిమానులకు.ఏది ఏమయితేనే కపిల్ దేవ్ తనలో ఉన్న ఇంకో షేడ్ ను కూడా బయట పెట్టి అందరిని షాక్ కు గురి చేసాడు.
కపిల్ దేవ్ ను చూసిన అభిమానులు అందరు తమకు నచ్చిన విధంగా కామెంట్స్ పెడుతున్నారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.