నారాయణపేట జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు.
మక్తల్ మండలం జక్లేర్ లో రోడ్డు ప్రమాదం సంభవించింది.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.అనంతరం ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.అయితే ప్రమాదం చోటు చేసుకోవడానికి అతివేగమే ప్రమాదమని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.