ఎటకేలకు తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) తమ పార్టీ నుంచి పోటీ చేయబోయే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది .మొత్తం 55 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.
తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా, తొలి జాబితాలో 55 మంది కి అవకాశం కల్పించారు.ఇప్పటికే తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించగా , బిజెపి అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది.
కాంగ్రెస్ ఈ రోజు 55 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.
ఈనెల 20 లోపు మొత్తం పూర్తిస్థాయిలో అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది.
అభ్యర్థుల ను ప్రకటించిన తర్వాత పూర్తిస్థాయిలో వారు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారానికి తిరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేసింది .పార్టీ తరఫున అనేక కార్యక్రమాలను సిద్ధం చేయడంతో పాటు, ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాల పైన దిశ నిర్దేశం చేయనుంది.ఇది ఇలా ఉంటే .నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ ప్రకటించిన 55 మంది అభ్యర్థుల పేర్లు ఈ విధంగా ఉన్నాయి.
1.బెల్లంపల్లి – గడ్డం వినోద్( Gaddam Vinod )
2.మంచిర్యాల- కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
3.నిర్మల్ – కూచాడి శ్రీహరిరావు
4.ఆర్మూర్ – ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి
5.బోధన్ – పి సుదర్శన్ రెడ్డి
6.బాల్కొండ – సునీల్ కుమార్ ముత్యాల
7.జగిత్యాల – టీ జీవన్ రెడ్డి( T Jeevan Reddy )
8.ధర్మపూరి – అడ్లూరి లక్ష్మణ్ కుమార్
9.రామగుండం – ఎమ్మెస్ రాజ్ ఠాకూర్
10. మంథని – దుద్దేళ్ల శ్రీధర్ బాబు

11.పెద్దపల్లి – చింతకొండ విజయ రమణారావు
12.వేములవాడ – ఆది శ్రీనివాస్( Adi Srinivas )
13.మానకొండూర్ – డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ
14.మెదక్ – మైనంపల్లి రోహిత్ రావు
15.ఆందోల్ – సి దామోదర నరసింహ
16.జహీరాబాద్ – ఆదం చంద్రశేఖర్
17.సంగారెడ్డి – తూర్పు జగ్గారెడ్డి( Jaggareddy )
18.గజ్వేల్ – తూముకుంట నర్సారెడ్డి
19.మేడ్చల్ – తోటకూర వజ్రేష్ యాదవ్
20.మల్కాజిగిరి – మైనంపల్లి హనుమంతరావు

21- కుత్బుల్లాపూర్ – కొలన్ హనుమంత రెడ్డి
22 ఉప్పల్ – ఎం పరమేశ్వర్ రెడ్డి</br>
23.చేవెళ్ల – పమేనా బీమ్ భారత్
24.పరిగి – టి రామ్మోహన్ రెడ్డి
25.వికారాబాద్ – గడ్డం ప్రసాద్ కుమార్
26.ముషీరాబాద్ – అంజన్ కుమార్ యాదవ్
27.మలక్ పేట – షేక్ అక్బర్
28.శరత్ నగర్ – డాక్టర్ కోట నీలిమ
29.నాంపల్లి – మహమ్మద్ ఫిరోజ్ ఖాన్
30.కార్వాన్ – వాస్మాన్ బీన్ మహమ్మద్ అల్ హజ్రి

31.గోషామహల్ – మొగిలి సునీత
32.చాంద్రాయణగుట్ట – బోయ నగేష్( Boya Nagesh )
33.యాకుత్ పురా కే రవిరాజు
34.బహదూర్పురా రాజేష్ కుమార్ పులిపాటి
35.సికింద్రాబాద్ ఆడం సంతోష్ కుమార్
36.కొడంగల్ అనుముల రేవంత్ రెడ్డి( Revanth Reddy )
37.గద్వాల్ సరిత తిరుపతయ్య
38.అలంపూర్ ఎస్ఐ సంపత్ కుమార్
39.నాగర్ కర్నూల్ డాక్టర్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి
40.అచ్చంపేట డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ

41.కల్వకుర్తి కసిరెడ్డి నారాయణరెడ్డి
42.షాద్ నగర్ – కే శంకరయ్య
43.కొల్లాపూర్ – జూపల్లి కృష్ణారావు
44.నాగార్జునసాగర్ – జైవీర్ కుందూరు
45.హుజూర్ నగర్ – నల్లమడ ఉత్తమ్ కుమార్ రెడ్డి( Uttam Kumar Reddy )
46.కోదాడ – నల్లమడ పద్మావతి రెడ్డి
47.నల్గొండ – కోమటిరెడ్డి వెంకటరెడ్డి
48.నకిరేకల్ – వేముల వీరేశం
49.ఆలేరు – బీర్ల ఐలయ్య
50.స్టేషన్ ఘన్ పూర్ – సింగపురం ఇందిరా
51.నర్సంపేట – దొంతి మాధవ రెడ్డి
52.భూపాలపల్లి – గండ్ర సత్యనారాయణ రావు
53.ములుగు – సీతక్క( Seethakka )
54.
మధిర – మల్లు భట్టి విక్రమార్క( Bhatti Vikramarka )
55.భద్రాచలం – పోదెం వీరయ్య