ఏపీలో ఓటర్ల తుది జాబితా( AP Voters List ) విడుదల అయింది.ఈ మేరకు జిల్లాల వారీగా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం రిలీజ్ చేసింది.
ఓటర్ల జాబితాలను ఎక్కడికక్కడ విడుదల చేయాలని ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది.
ఈ క్రమంలోనే జిల్లాలు, నియోజకవర్గాల వారీగా ఎన్నికల సంఘం విడుదల చేసిన జాబితాలను రాష్ట్ర సీఈవో వెబ్ సైట్ లో ప్రచురించారని తెలుస్తోంది.నియోజకవర్గాల వారీగా పీడీఎఫ్ ఓటర్ల జాబితాలు వెబ్ సైట్ లో అప్ లోడ్ చేశారు.మరోవైపు రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధతపై సీఎస్ జవహర్ రెడ్డి( CS Jawahar Reddy ) సమీక్ష నిర్వహించారు.
పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు, బదిలీలపై చర్చించారని సమాచారం.