స్మార్ట్‌వాచ్ ప్రేమికులకు శుభవార్త... ఫాస్ట్రాక్ నుంచి రాబోతున్న బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్!

నేటితరం యువతీయువకులు స్మార్ట్‌వాచ్ లపై మనసు పారేసుకుంటున్నారు.ఈ నేపథ్యంలో ప్రముఖ వాచెస్ పరిశ్రమలో ఒక బ్రాండ్ గా వెలుగొందుతోన్న ‘ఫాస్ట్రాక్’ తన ఫస్ట్ బ్లూటూత్ స్మార్ట్‌వాచ్‌ను లాంచ్ చేసింది.

 Fastrack Reflex Play Plus Smartwatch Features With Bluetooth Calling Details, Bl-TeluguStop.com

‘ఫాస్ట్రాక్ రిఫ్లెక్స్ ప్లే+’ పేరుతో ఈ కాలింగ్ స్మార్ట్‌వాచ్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.గతంలో సాధారణ స్మార్ట్‌వాచ్‌లను అందుబాటులోకి తెచ్చినప్పటికీ, బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో రిలీజ్ చేయడం ఇదే ఫస్ట్ టైం కావడం విశేషం.

సర్క్యులర్ షేప్ డిజైన్, అమోలెడ్ డిస్‌ప్లే, అల్యూమినియమ్ కేస్‌తో లుక్‌పరంగానూ ఈ వాచ్ ఎంతో ఆకర్షణీయంగా ఉంది.

ఇక ధర, ఫీచర్స్ విషయానికొస్తే… ‘ఫాస్ట్రాక్ రిఫ్లెక్స్ ప్లే+’ ను రూ.6995 ధరని కలిగి వుంది.అయితే.ఈకామెర్స్ సైట్ అయినటువంటి అమెజాన్ లో మాత్రం రూ.1,000 తగ్గింపుతో రూ.5,995 ధరకు అందుబాటులో ఉంది.కాబట్టి దీన్ని కొనాలనుకొనేవారు ఇక్కడ తీసుకోవడం ఉత్తమం.

అలాగే ఫాస్ట్రాక్ ఆఫ్‌లైన్ స్టోర్‌లో కూడా ఇవి లభించనున్నాయి.ఇవి బ్లాక్, బ్లూ, పింక్, అక్వాబ్లూ కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో వున్నాయి.

ఫీచర్స్ విషయానికొస్తే…

1.ఫాస్ట్రాక్ రిఫ్లెక్స్ ప్లే+లో రౌండ్ షేప్ డయల్ కలదు.

Telugu Bluetooth, Bluetoothsmart, Fastrackreflex-Latest News - Telugu

2.1.3 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లే.

3.సిలికాన్ స్ట్రాప్స్‌ను కలిగి ఉంది.బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌ అదనం.

4.ఇన్‌బుల్ట్‌ మైక్, స్పీకర్ కలవు.

5.హార్ట్‌రేట్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ సాచురేషన్ ట్రాకర్(SpO2), బ్లడ్ ప్లజర్ మానిటరింగ్‌.వంటి హెల్త్‌ ఫీచర్స్ కలవు.

6.విభిన్నమైన స్పోర్ట్స మోడ్స్‌కు సపోర్ట్ చేస్తుంది.

7.మ్యూజిక్, కెమెరాను కంట్రోల్ చేయవచ్చు.

గమనిక: ఫుల్ చార్జ్‌పై ఈ స్మార్ట్‌వాచ్ 7 రోజుల బ్యాటరీ లైఫ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube