అధిక హెయిర్ ఫాల్( Hair fall) కారణంగా మనలో చాలా మంది జుట్టు రోజురోజుకు పల్చగా మారిపోతూ ఉంటుంది.జుట్టు పల్చగా మారడం తగ్గి ఒత్తుగా పెరగాలంటే మొదట హెయిర్ ఫాల్ కు అడ్డుకట్ట వెయ్యాలి.
అదే సమయంలో హెయిర్ గ్రోత్ ను ఇంప్రూవ్ చేసుకోవాలి.అయితే ఈ రెండిటికి ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ టోనర్ చాలా బాగా సహాయపడుతుంది.
వారానికి రెండు సార్లు కనుక ఈ టోనర్ ను వాడితే మీ జుట్టు ఎంత పల్చగా ఉన్నా నెల రోజుల్లో ఒత్తుగా మారుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ టోనర్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అయ్యాక అందులో నాలుగు రెబ్బలు కరివేపాకు, వన్ టేబుల్ స్పూన్ కలోంజి సీడ్స్( Kalonji Seeds ) మరియు రెండు తుంచిన బిర్యానీ ఆకులు వేసుకోవాలి.వీటితో పాటు రెండు టేబుల్ స్పూన్లు టీ పౌడర్( Tea Powder ) వేసి దాదాపు 15 నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో మరిగించిన నీటిని ఫిల్టర్ చేసుకోవాలి.
ఈ వాటర్ గోరువెచ్చగా అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆముదం( Ricinus) వేసి బాగా మిక్స్ చేసుకుంటే మన టోనర్ అనేది సిద్ధమవుతుంది.

ఒక స్ప్రే బాటిల్ లో ఈ టోనర్ నింపుకొని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకోవాలి.40 నిమిషాల అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి రెండు సార్లు ఈ న్యాచురల్ టోనర్ ను కనుక వాడితే మీ జుట్టుకు మంచి పోషణ లభిస్తుంది.
కుదుళ్ళు బలోపేతం అవుతాయి.జుట్టు రాలడం కంట్రోల్ అవుతుంది.
అదే సమయంలో జుట్టు ఎదుగుదల చురుగ్గా మారుతుంది.జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది.
కాబట్టి పల్చటి జుట్టుతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ టోనర్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.







