యంగ్ హీరోల్లో ఒకరైన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda ) కు ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ను ఏర్పరుచుకున్నారో అందరికి తెలుసు.అంతటి ఫాలోయింగ్ ఉన్న ఈయన స్టార్ హీరోల లిస్టులో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.
అందుకోసం విజయ్ చాలానే కష్ట పడుతున్నాడు.ఇక ఇటీవలే విజయ్ ఖుషి సినిమాతో హిట్ అందుకున్నాడు.
ఐదేళ్ల తర్వాత ఖుషి వంటి విజయం అందుకోవడంతో ఇదే ఆనందంలో మరిన్ని సినిమాలను లైన్లో పెడుతున్నాడు.ఖుషి తర్వాత మరో రెండు సినిమాలను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళాడు.
అందులో పరశురామ్ తో చేస్తున్న ‘ఫ్యామిలీ స్టార్‘ ( Family Star ) ఒకటి.
విజయ్ కు గీతా గోవిందం వంటి ఘన విజయం అందించిన పరశురామ్ తోనే ఈ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో మరో విజయం అందుకోవడం ఖాయం అంటూ ఆయన ఫ్యాన్స్ అంటున్నారు.ఇటీవలే ఈ సినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ టీజర్ ను రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.
ఇక ఇప్పుడు మేకర్స్ ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తుంది.అతి త్వరలోనే ఈ సినిమా మొదటి సాంగ్ ను రిలీజ్ చేయనున్నారని ఈ మొదటి సింగిల్ అప్డేట్ దీపావళి కానుకగా రానుందని టాక్.మరి ఆ రోజే తెలియనుంది ఈ సినిమా మొదటి సాంగ్ ను ఎప్పుడు రిలీజ్ చేయనున్నారో.ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో విజయ్ కు జోడిగా మృణాల్ ఠాకూర్ ( Mrunal Thaku )హీరోయిన్ గా నటిస్తుండగా దిల్ రాజు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.
అలాగే సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 13న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.