విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు( Nandamuri Taraka Rama Rao ) ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు.ఆయన ఏ పాత్ర వేసినా పాత్రకే అందం వస్తుందనడంలో సందేహం లేదు.
తెలుగు ఇండస్ట్రీకి దొరికిన ఒక ఆణిముత్యం ఆయన.ఈ దివంగత నటుడు కెరీర్ మొత్తంలో 300 సినిమాల్లో నటించారు.అందులో రెండు సినిమాలకు మాత్రం సొంతంగా డబ్బింగ్ చెప్పుకోలేదు.వాటిలో ఒకటి “సంపూర్ణ రామాయణం”( Sampoorna Ramayanam ). ఈ మూవీలో ఎన్టీఆర్ శ్రీకృష్ణుని పాత్రలో కనిపించారు.ఈ మూవీలో ఎన్టీఆర్ బదులు వేరే వ్యక్తి డబ్బింగ్ చెప్పినా ప్రేక్షకులు ఆశ్చర్యపోలేదు.
ఎన్టీఆర్ సొంత డబ్బింగ్ చెప్పని మరొక సినిమా “ఎర్రకోట వీరుడు”.ఎర్రకోట వీరుడు 18 ఏళ్లు ఆలస్యంగా విడుదలైంది.
ఆ సమయంలో ఎన్టీఆర్ స్టార్ హీరోగా ఉన్నారు.ఈ మూవీలో ఎన్టీఆర్ వాయిస్ వెరైటీగా ఉండటం, ఆయన అవతారం కూడా చిత్రంగా ఉండటం చూసి అభిమానులు షాక్ అయ్యారు.
1955లో హెచ్.ఎం.రెడ్డి ఎన్.టి.రామారావును హీరోగా పెట్టి “ఎర్రకోట వీరుడు”ని ‘గజదొంగ’ పేరుతో ప్రారంభించారు.దీనిని వై.ఆర్.స్వామి డైరెక్ట్ చేయడం మొదలుపెట్టారు.
సావిత్రి, బి.సరోజాదేవిలను హీరోయిన్లుగా, రాజనాల, ఆర్.నాగేశ్వరరావులను విలన్లుగా ఎంపిక చేసుకున్నారు.ఈ సినిమా 50% కంప్లీట్ అయ్యాక హెచ్.ఎం.రెడ్డి కన్నుమూయడంతో సినిమా ఆగిపోయింది.ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న సినిమా కాబట్టి కొందరు దీనిని పునఃప్రారంభించారు.అయితే దురదృష్టం కొద్దీ ఆర్.నాగేశ్వరరావు( R Nageswara Rao ) చనిపోయారు.దాంతో మరోసారి ఈ మూవీకి బ్రేక్ పడింది.
కొంతకాలానికి ఆర్.నాగేశ్వరరావు పాత్రను తమిళ నటుడు నంబియార్ చేయడానికి ఒప్పుకున్నాడు.
దాంతో మళ్లీ షూటింగ్ ప్రారంభం అయ్యింది.ఈసారి వై.ఆర్.స్వామి తప్పుకున్నాడు.
దాంతో డైరెక్టర్ పార్థసారథి( Director Partha Saradhi ) ఈ మూవీ దర్శకత్వ బాధ్యతలను తన భుజాలకు ఎత్తుకున్నాడు.
మూవీ టైటిల్‌ను కూడా ‘ధర్మవిజయం’గా చేంజ్ చేశారు.అలా మళ్లీ మొదలైన ఈ సినిమా చాలా అడ్డంకులను ఎదుర్కొంటూనే ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకుంది.పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేయడంలో కూడా చాలానే ఇబ్బందులు ఎదురయ్యాయి.
దీనివల్ల ఈ మూవీ పూర్తి కావడానికి మరింత సమయం పట్టింది.అగ్ర నటీనటులు నటించిన సినిమా కాబట్టి దీనిని ఎలాగైనా పూర్తి చేయాలని ప్రొడ్యూసర్ టి.గోపాలకృష్ణ ముందుకు వచ్చారు.
ఆయన సొంత డబ్బులతో ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అన్ని పూర్తి చేశారు.
ఇక రిలీజ్ చేద్దాం అనుకుంటున్న సమయంలో మరో సమస్య వచ్చి పడింది.అదేంటంటే ఎన్టీఆర్ డబ్బింగ్ కంప్లీట్ చేయాల్సిన అవసరం వచ్చింది.ఎప్పుడో 18 ఏళ్ల క్రితం ఆగిపోయిన ఈ సినిమాకి ఇప్పుడు డబ్బింగ్ చెప్పమంటే బాగుంటుందో లేదో అని టి.గోపాలకృష్ణ తనలో తానే మానసిక పోరాటం చేశాడు.ఎన్టీఆర్ ఏమైనా అనుకుంటారేమో అనే మొహమాటంతో చివరికి డబ్బింగ్ ఆర్టిస్ట్ దశరథరామిరెడ్డితో ఎన్టీఆర్ రోల్ కి డబ్బింగ్ చెప్పించాడు.మిగిలిన నటీనటులు డబ్బింగ్ కూడా కంప్లీట్ చేయించి మూవీకి ‘ఎర్రకోట వీరుడు’( Errakota Veerudu ) అనే టైటిల్‌ను ఫైనలైజ్ చేశాడు.
దీనిని 1973 డిసెంబర్ 14న తెలుగులో రిలీజ్ చేశాడు.అయితే ఎన్టీఆర్ కొత్త సినిమా వస్తుందంటే చాలు అప్పట్లో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకునేవారు.ఆ అంచనాలతోనే ఈ సినిమాకి వచ్చారు కానీ అందులో ఎన్టీఆర్ వాయిస్ వేరేగా ఉండటంతో డిసప్పాయింట్ అయ్యారు.దశరథరామిరెడ్డి డబ్బింగ్ వారికి అసలు నచ్చలేదు.
అందుకే ఈ మూవీ ఫెయిల్ అయింది.