ఆదిలాబాద్ కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.జిల్లాలోని అంగన్ వాడీలు కలెక్టర్ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు.
కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించిన అంగన్వాడీలను పోలీసులు అడ్డుకున్నారు.ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళన కారులకు మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
అనంతరం ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అయితే తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శాంతియుతంగా నిరసన చేస్తున్న ప్రభుత్వం కానీ, అధికారులు కానీ పట్టించుకోవడం లేదని అంగన్ వాడీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.