ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు ఎగ్జిట్ పోల్స్ సమయాన్ని సీఈసీ సవరించింది.
సాయంత్రం 5.30 గంటల తరువాత ఎగ్జిట్ పోల్స్ ప్రకటించుకోవచ్చని ఎన్నికల సంఘం ప్రకటించింది.అయితే సాయంత్రం 6.30 గంటల తరువాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల చేయాలని గతంలో సీఈసీ ఆదేశించిన సంగతి తెలిసిందే.తాజాగా ఆ సమయంలో మార్పులు చేసింది.కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సాయంత్రం 5 గంటలతో ముగియనుంది.