తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ వ్యూహాలు బిజెపి నేత ఈటెల రాజేందర్ కు తెలియనివి కావు.రాజేందర్ టిఆర్ఎస్ లో ఉన్నప్పటి నుంచి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా మెలిగిన వ్యక్తి కావడంతో, కెసిఆర్ రాజకీయ వ్యూహాలు ఏ విధంగా ఉంటాయో ఆయనకు బాగా తెలుసు.
ఏ సమయంలో ఏ విధంగా ప్రత్యర్ధిని ఇరకాటంలో పెట్టి పై చేయి సాధించాలో కెసిఆర్ కు తెలిసినంతగా మరెవరికీ తెలియదు అనే విషయం రాజేందర్ కు బాగా తెలుసు.అయినా ఇప్పుడు రాజేందర్ టిఆర్ఎస్ ప్రత్యర్థిగా ఉండడంతో కెసిఆర్ వ్యూహలను ఎదుర్కొని హుజురాబాద్ లో గట్టెక్కాలని చూస్తున్నారు .అయితే రాజేందర్ శక్తి సామర్ధ్యాలు కెసిఆర్ కు బాగా తెలియడం, హుజురాబాద్ లో ఆయనకు ఉన్న బలం, బలగం ఇవన్నీ అంచనా వేసే సామాజిక వర్గాల వారీగా ఓటర్ల ను దూరం చేసే పనులు కెసిఆర్ నిమగ్నమయ్యారు.
ఇప్పటికే దళిత బంధు వంటి పథకాన్ని ప్రవేశపెట్టి బిజెపికి ఆ నియోజక వర్గంలో స్థానం లేకుండా చేసే వ్యూహంలో నిమగ్నమయ్యారు.
అయితే దళిత బంధు తో పాటు , బిసి బంధు, గిరిజన బందు ఇలా అనేక బందు పథకాలు ప్రవేశపెట్టి తమకు దళిత బంధు తరహాలోనే నిధుల కేటాయింపు చేయాలంటూ బీజేపీ కాంగ్రెస్ ల పై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉండడం కాస్త ఇబ్బందికరంగా మారింది.అయినా రాజేందర్ దూకుడుగా ముందుకు వెళ్తుండటంతో, రాజేంద్ర ప్రధాన అనుచరులను టిఆర్ఎస్ టార్గెట్ చేసుకుంది.
ఇప్పటికే టీఆర్ఎస్ మిత్రులందరికీ గాలం వేస్తున్నారు .కరీం నగర్ జిల్లా కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ వైస్ చైర్మన్ రమేష్, మరో నాయకుడు రాజేందర్ కు అత్యంత సన్నిహితులుగా ఉన్న వీరిద్దరూ బిజెపికి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు .
రాజేందర్ వెంట బిజెపిలో చేరినా, అక్కడ తమకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదని, వారు విమర్శిస్తూ. కేసీఆర్ ని పొగడ్తలతో ముంచెత్తారు. దళిత బంధు వంటి చారిత్రాత్మక పథకాన్ని ప్రవేశపెట్టిన కేసీఆర్ ఎంతో గొప్ప వ్యక్తి అంటూ వారు పొగడ్తలతో ముంచెత్తారు.ఇదే విధంగా రాజేందర్ ప్రధాన అనుచరులు అందరినీ తమ దారిలోకి తెచ్చుకునేందుకు టిఆర్ఎస్ ముందడుగు వేస్తోంది.
ఈ విధంగా రాజేందర్ ను ఒంటరి చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.