ఈసారి జనసేన.. మాత్రమే ?

తెలంగాణలో ఎన్నికల వేడి ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.ప్రధాన పార్టీలన్నీ గెలుపు కోసం హోరాహోరీగా తలపడుతున్నాయి.

 This Time Janasena Only , Jana Sena , Ycp, Bjp , Ys Jagan, Ts Politics , Telang-TeluguStop.com

అధికార బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ వంటి పార్టీలతో పాటు సీపీఎం, సిపిఐ, బిఎస్పీ, ప్రజాశాంతి వంటి పార్టీలు కూడా ఎన్నికల బరిలో ఉన్నాయి.ఇకపోతే ఏపీ పార్టీలలో టీడీపీ( TDP ) గత రెండు సార్లు ఎన్నికల బరిలో నిలిచింది.

కానీ ఈసారి మాత్రం తెలంగాణ ఎన్నికలకు దూరంగా ఉంటున్నాట్లు ప్రకటించింది.ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ విషయానికొస్తే.

మొదటి నుంచి తెలంగాణను లైట్ తీసుకుంటూనే వచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.

Telugu Cm Kcr, Jana Sena, Pawan Kalyan, Telangana, Ts, Ys Jagan-Politics

వైసీపీ కేవలం ఏపీ వరకే పరిమితంగా ఉంటుందని, తెలంగాణ వైసీపీ పోటీ చేసే అవకాశం లేదని 2014లోనే జగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ) క్లారిటీ ఇచ్చారు.దాంతో తెలంగాణ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేసే అవకాశం ఏమాత్రం లేదు.కానీ ఈసారి మాత్రం ఏపీ పార్టీలలో జనసేన తెలంగాణ ఎన్నికల బరిలో నిలిచింది.2018 ఎన్నికల్లో దూరంగా ఉన్న జనసేన ఈసారి మాత్రం బీజేపీతో పొత్తులో ఉంటూ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయనుంది.

Telugu Cm Kcr, Jana Sena, Pawan Kalyan, Telangana, Ts, Ys Jagan-Politics

దీంతో ఏపీ నుంచి తెలంగాణ బరిలో ఈసారి కేవలం జనసేన పార్టీ మాత్రమే( Jana sena ) పోటీలో ఉంది.ఇక ఈ ఎన్నికలలో జనసేన ప్రభావం ఎంతవరకు ఉంటుందనే దానిపై పెద్దగా ఎవరికి అంచనాలు లేవనే చెప్పాలి.ఎందుకంటే ఏపీతో పోల్చితే తెలంగాణలో జనసేన పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు.

దానికి తోడు ఎన్నికల ప్రచారంపై కూడా పవన్ పెద్దగా ఆసక్తి చూపడం లేదు.కేవలం బీజేపీతో పొత్తు కారణంగానే జనసేన తెలంగాణలో పోటీ చేస్తున్నాట్లు తెలుస్తోంది.దీంతో ఒకటి అర శాతం తప్పా జనసేన ఓటు షేర్ ఇతర పార్టీలపై ప్రభావం చూపే అవకాశం లేదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.మరి ఆ బీజేపీకి జనసేన ఎంతవరకు ప్లెస్ అవుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube