ముగ్గురికి కలిసి రాని ఆ పేర్లు...

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అక్కినేని ఫ్యామిలీ కి( Akkineni Family ) చాలా మంచి క్రేజ్ ఉంది వరుసగా రెండు తరాలకి సంభందించిన హీరోలు ఇండస్ట్రీ లో టాప్ హీరోలు గా దూసుకుపోయారు కానీ మూడో తరం లో అంత పెద్ద స్టార్ అయ్యే హీరో ఇప్పటి వరకు లేరు అనే చెప్పాలి…ఇక నాగార్జున ( Nagarjuna ) కొడుకులు అయిన నాగచైతన్య అఖిల్ తో కలిపి ముగ్గురు వ‌రుస సినిమాలు చేస్తున్నారు.కానీ, ముగ్గురికీ స‌రైన హిట్ మాత్రం ప‌డ‌టం లేదు.

 English Movie Titles Bad Sentiment For Akkineni Heros Nagarjuna Akhil Nagachaita-TeluguStop.com

నాగార్జున నుంచి చివ‌రిగా వ‌చ్చిన చిత్రాలు వైల్డ్ డాగ్, ది ఘోస్ట్. గ‌త ఏడాది భారీ అంచ‌నాల న‌డుమ‌ విడుద‌లైన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా ప‌డ్డాయి.

అలాగే అఖిల్ ( Akhil ) రీసెంట్ గా `ఏజెంట్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు.సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఇది.ఇందులో సాక్షి వైద్య హీరోయిన్ గా న‌టిస్తే.మ‌ల‌యాళ మెగాస్టార్‌ మ‌మ్ముట్టి కీల‌క పాత్ర‌ను పోషించాడు.దాదాపు రూ.80 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మిత‌మైన ఈ చిత్రం.అనేక వాయిదాల అనంత‌రం గ‌త నెల రిలీజ్ అయింది.కానీ, బాక్సాఫీస్ వ‌ద్ద అట్ట‌ర్ ఫ్లాప్ గా నిలిచింది…

 English Movie Titles Bad Sentiment For Akkineni Heros Nagarjuna Akhil Nagachaita-TeluguStop.com
Telugu Akhil, Akkineni Bad, Akkineni, Akkineni Heros, English, Nagachaitanya, Na

ఇక థ్యాంక్యూ ఫ్లాప్ త‌ర్వాత అక్కినేని నాగ‌చైత‌న్య `క‌స్ట‌డీ`( Naga Chaitanya ) మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు.వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా న‌టించింది.అర‌వింద్ స్వామి విల‌న్ గా చేశారు.

మే 12న తెలుగు, త‌మిళ భాష‌ల్లో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను అంచ‌నాల‌ను అందుకోవ‌డంతో విఫ‌లం అయింది.అయితే వ‌రుస ఫ్లాపుల నేప‌థ్యంలోనే ఓ బ్యాడ్ సెంటిమెంట్‌ తెర‌పైకి వ‌చ్చింది…

Telugu Akhil, Akkineni Bad, Akkineni, Akkineni Heros, English, Nagachaitanya, Na

అదేంటంటే.అక్కినేని హీరోల‌కు ఇంగ్లీష్ టైటిల్స్ క‌లిసిరావ‌డం లేద‌ని, అవే వారికి శాపంగా మారాయంటూ అభిప్రాయ‌ప‌డుతున్నారు.స‌రిగ్గా గ‌మ‌నించిన‌ట్లైతే.

అక్కినేని హీరోలు ఇంగ్లీష్ టైటిల్స్ తో చేసిన చిత్రాల్లో అత్య‌ధిక సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ్డాయి.ఈ లిస్ట్ లో ది ఘోస్ట్‌, వైల్డ్ డాగ్, ఆఫీసర్, హ‌లో, ఏజెంట్‌, థ్యాంక్యూ, క‌స్ట‌డీ వంటివి ఉన్నాయి.

దీంతో ఇంగ్లీష్‌ టైటిల్స్ అక్కినేని హీరోల‌కు క‌లిసిరావ‌డం లేదు అన్న సెంటిమెంట్ బ‌ల‌ప‌డింది.ఈ నేప‌థ్యంలోనే ప్రస్తుతానికి ఈ ఇంగ్లీష్ టైటిల్స్ ని పక్కన పెట్టి.

తెలుగు టైటిల్స్ తో సినిమాలు చేయ‌మ‌ని ఫ్యాన్స్ అక్కినేని హీరోల‌కు సూచిస్తున్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube