కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Danush )కుతెలుగులో ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే.తమిళంలో ఈయన నటించిన సినిమాలన్నీ కూడా తెలుగులో డబ్ అయ్యి తెలుగు ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ఈ క్రమంలోనే ధనుష్ తనకు తెలుగులో ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకొని ఏకంగా తెలుగు సినిమానే చేశారు.వెంకీ అట్లూరి( Venky Atluri ) దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటించిన చిత్రం సార్( Sir ) .ఈ సినిమాలో నటి సంయుక్త మీనన్( Samyuktha Menon ) హీరోయిన్ గా నటించారు.ఇక ఈ సినిమా తెలుగుతోపాటు తమిళంలో కూడా విడుదలైంది తమిళంలో ఈ సినిమా వాతి అనే పేరిట ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో ఫిబ్రవరి 17వ తేదీ విడుదల అయ్యి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.కార్పొరేట్ విద్యాసంస్థలలో జరుగుతున్న అక్రమాలను మోసాలను బయటపెట్టే ఓ లెక్చరర్ పాత్రలో ధనుష్ ఇందులో నటించారు.ఇలా ఈ సినిమా థియేటర్లలో అద్భుతమైన కలెక్షన్లను రాబట్టి ధనుష్ నటించిన మొదటి తెలుగు సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.ఇక ఈ సినిమా థియేటర్లలోనే కాకుండా ఓటీటీ లో కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.
ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సమస్థ నెట్ ఫ్లిక్స్ ( Netflix )భారీ ధరలకు కొనుగోలు చేశారు.
ఇలా ఓటిటిలో కూడా ఈ సినిమా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.ఇలా ఈ సినిమా థియేటర్లలోను ఓటీటీలోను ఎంతో మంచి ఆదరణ సంపాదించుకొని ఇక టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైంది.ఈ సినిమా ప్రముఖ టెలివిజన్ ఛానల్ అయినటువంటి జెమినీ ( Gemini ) టీవీలో ప్రసారం కాబోతుందని తాజాగా వెల్లడించారు.
అయితే ఎప్పుడు ప్రసారమవుతుందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు బహుశా ఈ సినిమా 19వ తేదీ జెమినీలో ప్రసారం కాబోతుందని తెలుస్తుంది.థియేటర్లోనూ ఓటీటీ లోను ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈ సినిమా టెలివిజన్ లో ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.