టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన ధనుష్ సార్… ఎప్పుడు ఎక్కడంటే?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Danush )కుతెలుగులో ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే.

తమిళంలో ఈయన నటించిన సినిమాలన్నీ కూడా తెలుగులో డబ్ అయ్యి తెలుగు ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ఈ క్రమంలోనే ధనుష్ తనకు తెలుగులో ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకొని ఏకంగా తెలుగు సినిమానే చేశారు.

వెంకీ అట్లూరి( Venky Atluri ) దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటించిన చిత్రం సార్( Sir ) .

ఈ సినిమాలో నటి సంయుక్త మీనన్( Samyuktha Menon ) హీరోయిన్ గా నటించారు.

ఇక ఈ సినిమా తెలుగుతోపాటు తమిళంలో కూడా విడుదలైంది తమిళంలో ఈ సినిమా వాతి అనే పేరిట ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

"""/"/ ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో ఫిబ్రవరి 17వ తేదీ విడుదల అయ్యి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

కార్పొరేట్ విద్యాసంస్థలలో జరుగుతున్న అక్రమాలను మోసాలను బయటపెట్టే ఓ లెక్చరర్ పాత్రలో ధనుష్ ఇందులో నటించారు.

ఇలా ఈ సినిమా థియేటర్లలో అద్భుతమైన కలెక్షన్లను రాబట్టి ధనుష్ నటించిన మొదటి తెలుగు సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

ఇక ఈ సినిమా థియేటర్లలోనే కాకుండా ఓటీటీ లో కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.

ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సమస్థ నెట్ ఫ్లిక్స్ ( Netflix )భారీ ధరలకు కొనుగోలు చేశారు.

"""/"/ ఇలా ఓటిటిలో కూడా ఈ సినిమా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.

ఇలా ఈ సినిమా థియేటర్లలోను ఓటీటీలోను ఎంతో మంచి ఆదరణ సంపాదించుకొని ఇక టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైంది.

ఈ సినిమా ప్రముఖ టెలివిజన్ ఛానల్ అయినటువంటి జెమినీ ( Gemini ) టీవీలో ప్రసారం కాబోతుందని తాజాగా వెల్లడించారు.

అయితే ఎప్పుడు ప్రసారమవుతుందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు బహుశా ఈ సినిమా 19వ తేదీ జెమినీలో ప్రసారం కాబోతుందని తెలుస్తుంది.

థియేటర్లోనూ ఓటీటీ లోను ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈ సినిమా టెలివిజన్ లో ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

దారుణంగా పడిపోయిన బిగ్‌బాస్ టీఆర్‌పీ రేటింగ్స్.. చరిత్రలో తొలిసారి..?