ఏపీలో అధికార పార్టీగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పుపై తీవ్ర కసరత్తు చేస్తోంది.ఇప్పటికే పదకొండు నియోజకవర్గాల్లో వైసీపీ అధిష్టానం మార్పులు చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఇవాళ మరో పదకొండు మంది అభ్యర్థుల పేర్లను పార్టీ అధిష్టానం ప్రకటించనుందని సమాచారం.ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో అభ్యర్థుల మార్పు జరిగింది.
ఈ మేరకు పదకొండు మంది అభ్యర్థులను ప్రకటించనున్న హైకమాండ్ మిగిలిన స్థానాలను రేపు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.