ఉల్లిపాయ.దీని గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.ఘాటుగా ఉండే ఉల్లిపాయను కోసేటప్పుడు కన్నీళ్లు పెట్టించినా.బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలను మనకు అందిస్తుంది.ఇక ఉల్లిపాయ లేనిదే రోజు వంట కూడా చేయలేము.ఏ కూరలోనైనా ఉల్లి ఉంటేనే రుచి మరియు ఆరోగ్యం కూడా.
గుండె జబ్బుల నుంచి రక్షించడంలో, రోగ నిరోధక శక్తి పెంచడంలో, క్యాన్సర్ కణాలను అంతం చేయడంలో, దగ్గు మరియు జలుబు సమస్యలను దూరం చేయడంలో ఇలా చెప్పుకుంటూ పోతే ఉల్లిలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
ఇక కొందరు ఉల్లిపాయల్ని వండకుండా పచ్చివి కూడా తినేస్తుంటారు.
ఇలా తీసుకున్నా ఆరోగ్యానికి మంచిదే.పచ్చి ఉల్లిపాయలు తీసుకోవడం వల్లనిద్రలేమి సమస్య దూరం అవుతుంది.
అధిక బరువు అదుపులోకి వస్తుంది.అయితే ఉల్లిపాయల విషయంలో చాలా మంది కామన్‌గా ఓ పొరపాటు చేస్తుంటారు.
సాధారణంగా చాలా మంది టైం సేవ్ చేసుకునేందుకు రాత్రే కట్ చేసుకుని.ఉదయం వాడుతుంటారు.
అలాగే మరి కొందరు కట్ చేసి పెట్టుకున్న కొన్ని గంటల తర్వాత వాటిని ఉపయోగిస్తుంటారు.కానీ, నిజానికి ఉల్లిపాయల్ని కట్ చేసిన కొన్ని గంటలకు తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఉల్లిపాయలను నిలువ ఉంచడం వల్ల అవి విషపూరితంగా మారి.మన ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయి.ఉల్లిపాయలను కట్ చేసి పెట్టుకున్నప్పుడు.అవి గాలి మరియు పలురకాలైన బ్యాక్టీరియాను పీల్చుకుంటాయి.
అదే సమయంలో ఉల్లిలో సహజంగా ఉండే కొన్ని టాక్సిన్స్ ఎక్కువ మొత్తంలో విడుదలవుతాయి.అలాంటి ఉల్లిపాయ ముక్కలను తీసుకుంటే.విషంతో సమానమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఫలితంగా డయేరియా, తలనొప్పి, వాంతులు, కడపునొప్పి, గ్యాస్ వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అంటున్నారు.కాబట్టి, ఉల్లిపాయలను ఎప్పుడైనా కోసిన వెంటనే వినియోగించేసుకోవాలి.అప్పుడే ఆరోగ్యానికి మంచిది.