హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది.ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో తనను గెలిపిస్తే జైత్రయాత్ర, ఓడిస్తే శవయాత్ర చేస్తానని చెప్పిన విషయం తెలిసిందే.
తనను గెలిపించకపోతే కుటుంబంతో సహా బలన్మరణం చేసుకుంటానని కౌశిక్ రెడ్డి తెలిపారు.ఈ క్రమంలోనే ఏ యాత్ర చేయాలో ప్రజలే నిర్ణయించుకోవాలంటూ కౌశిక్ రెడ్డి మాట్లాడారు.
ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న ఈసీ కామెంట్స్ పై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.అదేవిధంగా కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై విచారణ జరిపి వివరణ ఇవ్వాలని స్థానిక ఆర్వోకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.