సాధారణంగా వర్షాకాలాన్ని వ్యాధుల కాలం అని కూడా అంటారు.ఈ కాలంలో ఏ మాత్రం జాగ్రత్తలు పాటించకున్నా.
వ్యాధుల భారిన పడే ప్రమాదం ఉంటుంది.ఈ నేపథ్యంలో వర్షాకాలంతో తినకూడని ఆహార పదార్థాలేంటో తెలుసుకుందాం.
ఇప్పటికే కరోనా నేపథ్యంలో మన ఫుడ్ హ్యాబిట్‌లో మార్పలు కూడా చోటుచేసుకున్నాయి.ఇమ్యూనిటీ పెంచే ఆహారాన్ని తినడానికి ప్రాధాన్యత నిస్తున్నాం.
ముఖ్యంగా వర్షాకాలంలో పాడైన ఫుడ్ జోలికి అస్సలు పోకూడదు.ఎందుకంటే ఈ సీజన్‌లో వైరల్ జ్వరాలు, జలుబు, దగ్గు ఇతర సీజనల్ వ్యాధుల భారిన పడే ప్రమాదం ఉంటుంది.
ముఖ్యంగా రోడ్డుపై విక్రయించే ఏ వస్తువులను తినకూడదు.ఆ ఆహారం, పండ్ల ముక్కలు అపరిశుభ్రంగా ఉంటాయి.
ముఖ్యంగా వర్షాకాలంలో ఈగలు, దోమల కారణంగా ఇంకా అపరిశుభ్రంగా మారతాయి.
మరో విషయం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే.
వర్షా కాలంలో ఆయిల్ ఫుడ్ ను తగ్గించుకోవాలి.ఆయిల్ ఫుడ్ తీసుకుంటే విరేచనాలు, జీర్ణక్రియలో ఇబ్బందులు తలెత్తుతాయి.
వర్షాకాలంలో బ్యాక్టీరియా లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.గొంగళి పురుగులు ఈ సీజ¯Œ లో ఆకు కూరలలో త్వరగా కనిపిస్తాయి.
ఈ కాలంలో ఆకు కూరలు ఎక్కువగా తింటే విరేచనాలు, కడుపు నొప్పు వంటి సమస్యలకు దారితీస్తుంది.మెంతి, పాలకూర, పుట్టగొడుగులు, బ్రోకలీ, కాలీఫ్లవర్ వంటి వాటిని తినడం మానేయాలి.
ఇక వర్షాకాలంలో సలాడ్ల జోలికి పోకపోవడం కూడా మంచిది.ఎందుకంటే ఇందులో కూరగాయాలు.
పండ్లు వాడతాం అందులో సూక్ష్మజీవులు ఉంటాయి.చేపలు, ఇతర సముద్ర ఆహారాన్ని కూడా వర్షాకాలంలో తినకూడదు.
వర్షాకాలం చాలా సముద్ర జీవులకు సంతానోత్పత్తి కాలం.
నీరు చాలా కలుషితమై ఉంటుంది.ఈ కాలంలో సముద్ర ఆహారం తినడం అనేక వ్యాధులను కలిగిస్తుంది.ఇంకా వర్షాకాలంలో వేడి కోసం చికెన్ వంటివి తింటారు నాన్ వెజ్ ప్రియులు.
ఏదైనా మితంగా తింటేనే బాగుంటుంది.వారానికి రెండు లేదా మూడుసార్లు తినవచ్చు.
కానీ, ఎక్కువసార్లు తినకూడదు.ఎందుకంటే ఈ సమయంలో మన జీర్ణక్రియ మెరుగ్గా పనిచేయదు.
ముఖ్యంగా ఏ ఆహారం తీసుకున్నా… ఇంట్లో స్వయంగా తయారు చేయడానికి ప్రాముఖ్యతను ఇవ్వాలి.లేదంటే ఇటువంటి విపత్కర సమయంలో మరిన్ని రోగాల బారిన పడే అవకాశం మనమే స్వయంగా ఇచ్చినట్లవుతుంది.
ఈ కాలంలో అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువ.కాబట్టి ఇంట్లో ఏ ఒక్కరికి వైరల్ వ్యాధులు వస్తే.
వారి వల్ల ఇతరులకు కూడా సోకే ప్రమాదం ఉంటుంది.ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి ఇంటి పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిని ఉంచకూడదు.