టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆ స్టార్ హీరో గురించి ఎంత చెప్పినా తక్కువే.చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మగధీరుడుగా ఇండస్ట్రీలో ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.
చలనచిత్ర పరిశ్రమలో తమ కంటూ ఒక స్టార్‌డంను క్రియేట్ చేసుకున్న చెర్రీ నిజ జీవితంలో ఏం జరుగుతుంది ? ఎలా జరగబోతుంది ? అనే అంశాలపై ప్రేక్షకులకు ఎప్పటినుంచో ఆసక్తి నెలకొంది.
రామ్ చరణ్ సినిమా ఇండస్ట్రీలో ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ప్రస్తుతం ఇండియా స్టార్ హీరోగా సినిమాలో నటిస్తున్నారు.
రామ్ చరణ్ ఉపాసన లో పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.రామ్ చరణ్, ఉపాసనలకు పెళ్లై ఇన్ని సంవత్సరాలవుతున్నా సంతానం అనేది లేకపోవడంపై పలువురు ఎంతో మంది వీరి సంతానం గురించి పలు అనుమానాలను వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే రామ్ చరణ్ దంపతులకు సంతాన విషయం పై ప్రముఖ ఆస్ట్రాలజీ నిపుణులు హరి శాస్త్రి స్పందించారు.
ఈ సందర్భంగా హరి శాస్త్రి స్పందిస్తూ.రామ్ చరణ్‌ది ధనసు లగ్నం.పంచమంలో కుజ, రాహువులున్నారని ఆయన అన్నారు.
మామూలుగా అయితే ఐదో స్థానంలో రాహువు ఉంటే కొంతమంది అధిక సంతానం కలుగుతుంది.ఒకవేళ కుజుడు కూడా అక్కడే ఉంటే ఇలా సంతానం లేటు అవడం అనేది జరుగుతుందని ఆయన తెలిపారు.
గోచారం ప్రకారం కూడా రామ్ చరణ్‌కి కొద్దిగా గ్రహస్థితి అనుకూలంగా లేదని, అందుకే కాస్త ఆలస్యం అవుతుందని ఆయన వివరించారు.ప్రపంచంలోని అందరు పిల్లలూ తన పిల్లలనీ భావించరని, ఆయన.వాళ్లిద్దరూ కూడా సోషల్ యాక్టివిటీస్‌లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారని ఆయన అన్నారు. అందర్నీ వాళ్లు ఒకేలా చూస్తారని, అందుకే వాళ్లకంటూ ప్రత్యేకంగా పిల్లలు కావాలని ఇప్పట్లో అనుకోవట్లేదేమోనని ఆయన అనుకుంటున్నట్లు చెప్పారు.
అంతేగానీ ఇంకెలాంటి లోపమూ లేదని ఆయన వెల్లడించారు.కాకపోతే కాస్త ఆలస్యం అవుతుందని ఆయన చెప్పారు.