బిగ్ బాస్ (Bigg Boss) కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరిస్తున్న నాగార్జున వీకెండ్ లో చాలా స్టైలిష్ లుక్ లో కనిపిస్తూ సందడి చేస్తూ ఉంటారు.ఇక వీకెండ్ సమయంలో నాగార్జున(Nagarjuna ) ధరించే డ్రస్సులు అందరిని పెద్ద ఎత్తున ఆకట్టుకుంటూ ఉంటాయి.
చూడటానికి కాస్త డిఫరెంట్ గా ఉండేటటువంటి ఈ డ్రెస్సులు ధరలు మాత్రం భారీగానే ఉంటాయని చెప్పాలి.ఇలా ఎప్పుడు డిఫరెంట్ లుక్ లో బిగ్ బాస్ వేదికపై సందడి చేసే నాగార్జున ఈ వీకెండ్ కూడా అలాగే కనిపించారు.
శనివారం ఎపిసోడ్లో భాగంగా ఈయన కంటెస్టెంట్లు చేసినటువంటి తప్పులను ఎత్తిచూపుతూ వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
ఇక ఆదివారం ఎపిసోడ్ లో భాగంగా ఎల్లో కలర్ స్వెట్ టీ షర్ట్ ధరించి వేదికపై సందడి చేశారు.
ఇక ఆదివారం నాగార్జున హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్లతో చాలా కూల్ గా మాట్లాడారు.ఇకపోతే ఆదివారం నాగార్జున వేసుకుని వచ్చినటువంటి ఈ స్వెట్ టీ షర్ట్ (Swet T Shirt) గురించి అమర్ (Amar) అడుగుతూ సార్ నాకు ఒక కోరిక ఉంది మీ టీషర్ట్ బాగుంది నాకు ఇవ్వండి సార్ అని అడగగా వెంటనే నాగార్జున ముందు నువ్వు కూర్చో అని సీరియస్ గానే చెప్పారు.
ఇందుకు సంబంధించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.
ఇలా అమర్ ఈ టీ షర్ట్ అడగడంతో ఈ టీ షర్టులో అంత స్పెషాలిటీ ఏముంది అంటూ ఎంతోమంది దీని గురించి గూగుల్ సెర్చ్ చేయడం మొదలుపెట్టారు.అయితే దీని ధర తెలిసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.ఈ స్వెట్ టీ షర్ట్ మన ఇండియన్ కరెన్సీ ప్రకారం ఏకంగా రెండు లక్షల రూపాయల విలువ చేస్తుందనే విషయం తెలిసి అందరూ షాక్ అయ్యారు.
అందుకే నాగార్జున అమర్ కి ఈ టీ షర్ట్ ఇవ్వడానికి నిరాకరించారేమో అంటూ దీని ధర తెలిసినటువంటి వారందరూ కూడా ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.