తమిళంలో రజినీకాంత్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో వచ్చిన శివాజీ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది.ఇక అందులో భాగంగానే ఆ సినిమాను తెలుగులో డబ్ చేయగా, ఇక్కడ కూడా ఒక మంచి విజయాన్ని నమోదు చేసుకుంది.
ఇక ఇదిలా ఉంటే విలన్ గా సుమన్ నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.అయితే ముందుగా ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం తెలుగులో విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన మోహన్ బాబుని తీసుకోవాలని అనుకున్నారట.
కానీ మోహన్ బాబు( Mohan Babu ) ఆ పాత్రకి నో చెప్పడంతో అందులో సుమన్ ను తీసుకున్నారు.
రజనీకాంత్( Rajinikanth ) మోహన్ బాబు ఇద్దరు ఫ్రెండ్స్ కావడం వల్ల అదే చనువుతో రజనీకాంత్ మోహన్ బాబు ని అడిగాడట, కానీ మోహన్ బాబు మాత్రం విలన్ గా చేయడం నచ్చక దాన్ని రిజెక్ట్ చేశాడు.విలన్ క్యారెక్టర్ కాకుండా ఏదైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉంటే చెప్పమని అదైతే చేస్తానని చెప్పారట.దాంతో రజనీకాంత్ కూడా తనని ఫోర్స్ చేయకుండా ఆ పాత్రలోకి సుమన్ ని తీసుకున్నాడు.
ఇక సుమన్( Suman ) తన విలనిజాన్ని పండించడమే కాకుండా ప్రేక్షకులందరికీ చేత శభాష్ అనిపించుకున్నాడు.
ఇక మొత్తానికైతే సుమన్ ఆ క్యారెక్టర్ లో నటించి మెప్పించాడనే చెప్పాలి.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో తెలుగు, తమిళంలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.శంకర్ కూడా తన రూట్లోనే అవినీతి పైన తన అస్త్రాన్ని సంధిస్తూ చేసిన ప్రయత్నం ప్రేక్షకులందరిని మెప్పించింది.
ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రజనీకాంత్ లోకేష్ కనక రాజ్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు.ఇక ఈ సినిమాతో మరోసారి రజినీకాంత్ భారీ బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకోవాలని చూస్తున్నాడు…