Poverty : ఉప్పు నీళ్లలో అన్నం కలుపుకుని తింటున్న బాలుడు.. కంటతడి పెట్టుకుంటున్న నెటిజన్లు..

సోషల్ మీడియా( Social media )లో వైరల్ అయ్యే కొన్ని వీడియోలు మనల్ని ఆకట్టుకుంటే మరికొన్ని వీడియోలు చాలా బాధను కలిగిస్తాయి.సామాజిక మాధ్యమాలలో అప్‌లోడ్ అయ్యే వీడియోలలో లగ్జరీ పీపుల్ లైఫ్ మాత్రమే కాదు పేదవారి జీవితం కూడా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది.

 A Boy Eating Rice Mixed With Salt Water Netizens Are Shedding Tears-TeluguStop.com

ఈ కంటెంట్ మన సమాజంలోని పేద ప్రజల సమస్యలను చూపుతుంది.తాజాగా అలాంటి వీడియో ఒకటి ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారింది.

ఈ వీడియో చాలా మంది చేత కంటతడి పెట్టిస్తోంది.ఆహారాన్ని వృధా చేయడం గురించి ఆలోచించేలా చేసింది.

ఈ క్లిప్‌లో స్కూల్ యూనిఫాం( School uniform )లో ఉన్న ఒక చిన్న పిల్లవాడిని మనం చూడవచ్చు.అతడు లంచ్ బ్రేక్‌లో ఇంటికి వచ్చినట్టుగా కనిపిస్తోంది.ఆపై ఒక పెద్ద పళ్ళెం నుంచి కొంచెం అన్నం తీసుకుని తన ప్లేటులో పెట్టుకున్నాడు.కొన్ని అన్నం మెతుకులు నేలమీద పడ్డాయి, వాటిని అలానే వదిలేయకుండా తీసుకొని తిన్నాడు.

ఆపై అన్నంలో ఉప్పు, నీళ్లు కలుపుకుని చాలా వేగంగా తిన్నాడు.ఆ వీడియోకు “జీవితం అందరికీ ఒకేలా ఉండదు… ఆహారాన్ని గౌరవించండి” అనే ఒక హార్ట్ టచ్చింగ్ మెసేజ్ ఇచ్చారు.

ఈ వీడియోను 10 లక్షల కంటే ఎక్కువ మంది ప్రజలు చూశారు.

కొంతమంది ఈ వీడియో చూసి కలవరపడ్డామని, కొంతమందికి జీవితం కష్టంగా ఉందని వారు అంగీకరించారు.కొందరు ఏడుస్తూ ఆ అబ్బాయికి సహాయం చేయాలనుకున్నారు.అతడిని ఎలా కాంటాక్ట్ అవ్వాలో, డబ్బులు లేదంటే ఆహారం ఎలా ఇవ్వాలో చెప్పమని కోరారు.

నీళ్ళు, మసాలాలతో అన్నం తినవలసి వచ్చిన తమ స్నేహితులను గుర్తు చేసుకున్నారు కొందరు.ఆకలితో అలమటించే వారికి ఆహారం ఇవ్వాలని, పేదలను గౌరవించాలని ఇతరులను కోరారు.

ఆహారాన్ని వృధా చేయడం తప్పని, ప్లేట్‌లో అన్నీ పూర్తి చేయాలనే నిబంధన తమ ఇంట్లో ఉందని ఒక నెటిజన్ కామెంట్ చేసింది.జీవితం అందరినీ బాధిస్తుందని దానికి పేదా ధనికా అనే తేడా ఉండదని, ఎవరూ సంతోషంగా లేరని కొందరు అన్నారు.

పేదలు ఆకలితో అలమటిస్తున్నారని, ధనవంతులు ఒత్తిడికి గురై అనారోగ్యం( illness ) పాలవుతున్నారని తెలిపారు.ఈ వీడియోను మీరూ చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube