తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
ఇక జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఎన్టీఆర్ పేరు చెప్పినా, తెరపై ఆయన కనిపించినా అభిమానులు పూనకాలతో ఊగిపోతారు.
ఇకపోతే ఇటీవలే తారక్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన విషయం తెలిసిందే.
ఆర్ఆర్ఆర్ సినిమా( RRR movie ) పాన్ ఇండియా మూవీ అయినప్పటికీ ఈ సినిమాతో తారక్ క్రేజ్ ప్రపంచం మొత్తం వ్యాపించింది.ఇకపోతే ప్రస్తుతం అదే ఊపుతో కొరటాల శివ( Koratala Siva ) దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో నటిస్తున్నారు.అయితే తాజాగా ఈ హీరోకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాను తెగ షేక్ చేస్తోంది.
అదేమిటంటే మాములుగా మనిషికి ఊత పదం ఉండటం అనేది చాలా కమన్.చాలా మంది ఊతపదాలను పదే పదే మాట్లాడుతూ ఉంటారు.అయితే మన ఎన్టీఆర్ కూడా స్టేటస్‌తో సంబంధం లేకుండా, ఎవరితోనైనా చాలా ఆప్యాయంగా పలకరిస్తారన్న విషయం తెలిసిందే.
కొత్త వారితో కూడా , చాలా కలిసిపోయి మాట్లాడుతారు.కాగా, ఈ హీరో తనకు సంబంధించిన ఒక క్రేజీ సీక్రెట్‌ను బయట పెట్టాడు.ఎవరికైనా సరే ఊతపదం అనేది కామన్‌గా ఉంటుంది.
అయితే మన జూనియర్ ఎన్టీర్‌కు కూడా ఒక ఊత పదం ఉన్నదంట.అరే నీ.
అనే పదాన్ని ఈ స్టార్ హీరో ఎక్కువగా వాడుతారట.కనీసం రోజుకి 100 సార్లకు పైగానే అరే నీ అనే పదాన్ని ఉపయోగిస్తానని ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.