విష్ణువు ఎనిమిదవ అవతారంగా వచ్చిన శ్రీకృష్ణుడు ప్రపంచంలో అన్ని కష్టాలను ఓడించే భగవద్గీత అనే జ్ఞానాన్ని మనకు అందించాడు.పెదవులపై వేణువు.
తలలో నెమలి పించం ఉన్న శ్రీకృష్ణుని చూస్తుంటే సర్వ కలలు ఆయనలో ఉన్నాయని అనిపించక మానదు.శ్రీకృష్ణుడు భూమిపై ఉన్నంతకాలం మానవ సంక్షేమం కోసమే బతికాడు.
అంతేకాకుండా కోరి వచ్చిన భక్తుల కోర్కెలను తీర్చేవాడు.
శ్రావణ మాసంలోని కృష్ణపక్షం అష్టమి తిథినాడు రోహిణీ నక్షత్రం నందు జన్మించిన శ్రీ కృష్ణునికి ఇద్దరు తల్లులు ఉన్నారు అన్న సంగతి అందరికీ తెలిసినదే.
కానీ శ్రీకృష్ణుడికి ఐదుగురు తల్లులు ఉన్నారు అన్న సంగతి మీకు తెలుసా.తెలియదా? అయితే వారు ఎవరు, వారి గురించి ఇక్కడ తెలుసుకుందాం.
దేవకి:
శ్రీకృష్ణుడికి నిజమైన తల్లిదండ్రులు వసుదేవుడు ఆయన సతీమణి అయిన దేవకి.దేవకి తన సోదరుడు కంసుని చెరసాలలో బంధించి అయిన నేపథ్యంలో చెరసాలలో ని శ్రీకృష్ణుడు జన్మించాడు.
దేవకి అష్టమ సంతానం ద్వారా కంసుడికి మరణ గండం ఉందని తెలుసుకొని, దేవకిని ఆమె భర్తను చెరసాలలో బంధించాడు.దేవకి దేవతలకు తల్లి అయినా అదితి అవతారమని చెబుతారు.అందుకే శ్రీకృష్ణుడిని నందనుడు, వాసుదేవుడు అని కూడా పిలుస్తారు.
యశోద:
దేవికి ఎనిమిదవ సంతానం అయిన శ్రీకృష్ణుడిని కంసుడు చంపుతాడు అనే ఉద్దేశంతో శ్రీకృష్ణుని చెరసాల నుండి యశోద వద్దకు చేరుతాడు. యశోద శ్రీకృష్ణుడిని పెంచిన తల్లి అయినా కన్నతల్లిలా శ్రీకృష్ణుని పెంచింది.శ్రీకృష్ణుడు, యశోద, నందుడు దంపతుల దగ్గర గోకులంలో పెరిగాడు.శ్రీకృష్ణుడు తన చిన్నతనంలో ఎన్నో చిలిపి పనులు చేస్తూ ఉండేవాడు.ఈ నేపథ్యంలో మట్టిని తింటున్నాడు అని మందలించినా యశోదకు తన నోట్లో సృష్టి మొత్తం చూపించి ఆశ్చర్య పరిచేలా చేశాడు.
అలా శ్రీకృష్ణుని మందలిస్తూ ఎంతో ప్రేమగా యశోద శ్రీకృష్ణుని పెంచింది.
రోహిణి:
వసుదేవుడు దేవకి కంటే ముందుగా రోహిణిని వివాహం చేసుకొని ఉంటాడు.ఈమెకి బలరాముడు, సుభద్ర జన్మిస్తారు.దేవకీ వసుదేవుల ఏడవ సంతానమైన బలరాముని రోహిణి గర్భంలో ప్రవేశ పెట్టడం ద్వారా వీరికి బలరాముడు జన్మిస్తాడు.ఈ విధంగా రోహిణి కూడా కృష్ణుడికి తల్లిలా భావించాడు.
సుముఖీ దేవి:
సందీపని ముని భార్య అయినా సుముఖీ దేవికి కూడా తల్లి హోదా కల్పించాడు శ్రీకృష్ణుడు.శ్రీకృష్ణుడు సందీ పని ముని దగ్గర విద్యాభ్యాసం చేస్తాడు.అయితే సుముఖీ దేవి శ్రీకృష్ణుని తన కుమారుడిగా ఉండేలా అడుగుతుంది.కావున శ్రీకృష్ణుడు ఆమెకు కూడా తల్లి హోదా కల్పించాడు.
పూతన:
పాలు తాగే వయసులో ఉన్న శ్రీకృష్ణుని హతమార్చేందుకు కంసుడు పూతన అనే రాక్షసిని పంపిస్తాడు.తన రొమ్ములలో కాలకూట విషాన్ని నింపుకుని కృష్ణుని హతమార్చాలని చూస్తుంది.అయితే ఈ విషయాన్ని ముందుగా గ్రహించిన కన్నయ్య, పాలతో పాటు ఆమె శరీరంలోని రక్తం మొత్తం తాగేస్తాడు.
దీనితో ఆమె చనిపోతుంది.దహన సంస్కారాలు నిర్వహించే సమయంలో, కాలిపోతున్న ఆమె దేహం సుగంధ పరిమళాలను వెదజల్లుతాయి.
ఈ ఘటన తర్వాత శ్రీకృష్ణుడు పూతన కు తల్లి హోదా కల్పించాడు.
LATEST NEWS - TELUGU