ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు రోగనిరోధక శక్తిని పెంచుకోడానికి వివిధరకాల ఆహారాలను తీసుకుంటున్నారు.అయితే చాలామంది డ్రై ఫ్రూట్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఆ కోవలోకి చెందినదే వాల్ నట్స్.వీటిని తెలుగులో ఆక్రూట్ కాయ గింజలు అని అంటారు.
వాల్ నట్స్ రోజు కొద్దిగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.ఎన్నో రకాల పోషక విలువులు మనకు ఇందులో దొరుకుతాయి.
కానీ, చాలా మంది వాల్ నట్స్ తినడానికి ఇష్టపడరు.దానికి కారణం ఏంటంటే వీటి రుచి చాలామందికి నచ్చదు గనుక.
అందుకే చాలా మంది వీటిని తినడానికి పెద్దగా ఆసక్తి చూపరు .కాకపోతే వైద్యులు ఇచ్చే సలహా ఏంటంటే… కనీసం రోజుకి రెండు లేదా అంతకన్నా ఎక్కువ వాల్ నట్స్ అన్నా తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని.
ఇకపోతే వీటిని ఏ వయసు వారు అయిన ఎలాంటి అనుమానం లేకుండా తినవచ్చు.అసలు వాల్ నట్స్ తింటే ఏ ఉపయోగం అనుకుంటున్నారా.? వీటిని తినడం ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి.వాల్ నట్స్ ని డైరెక్ట్ గా తినడం కంటే నీటిలో నానబెట్టుకుని తీసుకుంటే అన్ని పోషకవిలువలు సమృద్ధిగా శరీరానికి లభిస్తాయి.
వాల్ నట్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్, యాంటీ ఆసిడ్స్ బాగా లభిస్తాయి.అంతేకాకుండా ఇవి గుండెకి సంబంధించిన జబ్బులు రాకుండా చూసుకోగలవు.అలాగే వాల్ నట్స్ లో ప్రోటీన్లు, ఫైబర్లు, విటమిన్లు అధికంగా లభిస్తాయి.కాబట్టి వీటిని తీసుకోవడం ద్వారా కడుపు నిండిన భావన కలుగుతుంది.
కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు ఇవి తీసుకోవడం ద్వారా ఫలితాన్ని పొందవచ్చు.
వీటితో పాటు రక్తపోటు కూడా అదుపులో ఉంచగలుగుతుంది.షుగర్ వ్యాధి గ్రస్తులు కూడా వీటిని తీసుకోవడం ద్వారా డయాబెటిస్ అదుపులో ఉంటుంది.మనం ఆరోగ్యకరంగా అలాగే దీర్ఘకాలం జీవించాలంటే వాల్ నట్స్ ను రెగ్యులర్ గా తీసుకోవాలి.
దాంతో మీరు ఫిట్ గా, హెల్తీగా ఉండటమే కాకుండా జీవితకాలాన్ని కూడా పెంచుకోవచ్చు.వాల్ నట్స్ తినడం వల్ల జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది.ఇవి చూడడానికి కూడా అచ్చం మెదడును పోలినట్లు ఉంటాయి.ఇవి తరచుగా తీసుకోవడం ద్వారా మెదడు పనితీరు కూడా బాగా పని చేస్తుంది.
వీటిని ప్రతిరోజు మనం తీసుకునే ఆహార పదార్థాల్లో చేర్చుకోవడం ద్వారా శరీరం లోని ఎలాంటి అలెర్జీలు అయినా తగ్గించడానికి ఉపయోగపడడమే కాకుండా, రోగనిరోధక శక్తి కూడా పెంపొందుతుంది.అలాగే వీటిలో మెలటోనిన్ అనే పదార్థం ఎక్కువగా దొరకడంతో బాగా నిద్రపోవాలి అనే వారికి ఇది ఒక వరం.వీటిని నానబెట్టి తీసుకోవడం ద్వారా శరీరంలో మంచి కొలెస్ట్రాల్ ఏర్పడుతుంది.దీనితో గుండెకు సంబంధించిన వ్యాధులు తక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది.
వీటితో పాటు ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం ద్వారా క్యాన్సర్ కణాల లాంటి రోగాల నుండి కూడా సులువుగా బయటపడవచ్చు.