ఇదేందయ్యా ఇది: ఈ సంతకాన్ని ఫోర్జరీ చేసే దమ్ముందా..?!

వైరల్ వార్తలు, వీడియోలు, ఫొటోలకు సోషల్‌ మీడియాలో కొదవే లేదు.తాజాగా వైరల్ అవుతున్న ఓ ఫొటో నెటిజన్లను ఇట్టే కట్టి పడేస్తోంది.

 Do You Have The Guts To Forge This Signature  , Signature , Forgare ,  Social Me-TeluguStop.com

దీన్ని చూసి లైక్స్, కామెంట్స్, షేర్స్ తో హోరెత్తిస్తున్నారు.ఇదంతా ఓ డాక్టర్‌ సంతకం గురించే.

ఇందులో విశేషం ఏంటి అనుకుంటున్నారా.? ఆయన గారి సంతకాన్ని ఎవరూ ఫోర్జరీ చేయలేరు.అంత కష్టంగా ఆయన సంతకం చేశారు మరి.ఆ ఫొటోను చూస్తే మీరు అలాగే అనుకుంటారు.చాలామంది తమ సంతకం కోసం పాఠశాల నుంచే సాధన చేస్తారు.

నోట్‌బుక్‌ల వెనుక పేజీలు మొత్తం వారి సంతకాలతో నిండి ఉంటాయి.మరి ఈ డాక్టర్ గారు తన సంతకం కోసి ఎన్నిరోజులు ప్రాక్టీసు చేసి ఉంటారని నెటిజన్లు చర్చించు కుంటున్నారు.ఈ షాకింగ్ సంతకం ఫోటో ఇప్పుడు నెట్టింట్లో హల్‌ చల్‌ చేస్తోంది.

డాక్టరి గారి సంతకం నెమలి పింఛాన్ని పోలి ఉండటం మరొక విశేషం.కాగా ఈ సంతకాన్ని ఓసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే.

అది గౌహతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అధికారిదని తేలింది.ఈ సంతకంపై ఎంతోమంది ఫన్నీ మీమ్స్ కూడా చేసి వైరల్ చేస్తున్నారు.

Telugu Bachelor, Signature, Forgare, Notebooks, Peacock-Latest News - Telugu

ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి రూపిన్ శర్మ దీన్ని తన సోషల్‌ మీడియాలో షేర్ చేశారు.ఈ చిత్రాన్ని చూసిన తర్వాత నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియ జేస్తున్నారు.ఓ వ్యక్తి చేసిన కామెంట్ మరింత ఆసక్తి ఉంది.‘పెన్ను సక్రమంగా పనిచేస్తుందో లేదో అధికారి చెక్‌ చేసినట్లు ఉన్నాడు’ అని కామెంటే చేశారు.‘ఈ సంతకాన్ని కాఫీ కొట్టడం ఎవరి తరం కాదు’ అని మరొకరు అభిప్రాయం వ్యక్తం చేశారు.ఈ సంతకం నెట్టింట్లో హల్ చేస్తూ పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఇలాంటి సంతకం పెట్టడం ఎవరి తరం కాదంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెట్టారు.ప్రస్తుతం దీనికి వేల సంఖ్యలో కామెంట్లు, లక్షలలో షేర్లు వచ్చాయి.

ఇదెక్కడి సైన్ రా మామా అంటూ చర్చ జరుగు తోంది.మరి డాక్టరు గారి సంతకంపై మీ అభిప్రాయం ఏంటి.?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube