యూపీఐ పేమెంట్స్ ఎక్కువగా చేస్తుంటారా? ఇక మీకు ఏప్రిల్‌ 1 నుంచి దబిడిదిబిడే!

ఈ వార్త మొబైల్‌ పేమెంట్‌ యాప్‌ కస్టమర్లకు మాత్రమే.మీరు జరా జాగ్రత్తగా ఉండాలి ఇకనుండి.

 Do Upi Payments A Lot? And You Will Be Extra Charge From April 1 ,  Latest News,-TeluguStop.com

విషయం ఏమంటే, ఇకపై యూపీఐ చెల్లింపులపై ( UPI payments )ఇంటర్‌ఛేంజ్‌ ఫీజు అనేది వసూలు చేస్తున్నారు.యూపీఐ విధానంలో చేపట్టే మర్చంట్‌ లావాదేవీలకు 1.1 శాతం రుసుము కట్ చేసుకుంటారు.అదేవిధంగా ఆన్‌లైన్‌ మర్చంట్స్‌, పెద్ద మర్చంట్స్‌, చిన్నపాటి ఆఫ్‌లైన్‌ మర్చంట్ల వద్ద చేసే రూ.2000కు పైగా విలువైన లావాదేవీలపై 1.1 శాతం ఇంటర్ ఛేంజ్‌ ఫీజు అనేది తీసుకుంటారు.ఎందుకంటే ప్రీపెయిడ్‌ సాధనాలను జారీ చేసినవారు డబ్బులు డిపాజిట్‌ అయిన బ్యాంకుకు 15 బేసిస్‌ పాయింట్ల మేర ఫీజు చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి.

Telugu April, Latest, Petrol, Ups-Latest News - Telugu

అదే విధంగా అవతలి వైపు పేమెంట్‌ బ్యాంకు నుంచి వీరికి వస్తే 15 బేసిస్‌ పాయింట్ల మేర ఫీజు వస్తుంది.సాధారణంగా కార్డు పేమెంట్ల అంగీకారం, ప్రాసెసింగ్‌, ఆథరైజింగ్‌ లావాదేవీల ఖర్చులు రాబట్టేందుకు ఇలా ఇంటర్‌ ఛేంజ్‌ ఫీజు అనేది తీసుకుంటూ వుంటారు.బ్యాంకు, ప్రీపెయిడ్‌ వ్యాలెట్‌ మధ్య పర్సన్‌ టు పర్సన్‌, పర్సన్‌ టు మర్చంట్‌ లావాదేవీలపై ఈ రుసుములు అనేవి వర్తించవు.

అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తికి, ఒక వ్యక్తి వేరే మర్చంట్‌తో చేసే లావాదేవీలపై ఫీజు ఉండదు.ఎన్‌పీసీఐ 1.1 శాతం ఇంటర్ ఛేంజ్‌ ఫీజు అమలు చేస్తున్నా అందరికీ ఇది ఒకేలా వర్తించకపోవచ్చు.

Telugu April, Latest, Petrol, Ups-Latest News - Telugu

ఉదాహరణకు ఒక ప్రీపెయిడ్‌ సాధనం నుంచి యూపీఐ ద్వారా పెట్రోల్‌ స్టేషన్లో( Petrol station ) చెల్లిస్తే 0.5 శాతమే ఫీజు వర్తిస్తుంది.ప్రీపెయిడ్‌ సాధనాల నుంచి యూపీఐ ద్వారా రూ.2000కు పైగా లావాదేవీ జరిపితే టెలికాంకు 0.70 శాతం, యుటిలిటీస్‌కు 0.70 శాతం, మ్యూచువల్‌ ఫండ్‌ (Mutual fund )కు ఒక శాతం, విద్యకు 0.70 శాతం, బీమాకు ఒక శాతం, సూపర్‌ మార్కెట్‌కు 0.90 శాతం, వ్యవసాయానికి 0.70 శాతం, కన్వీనియెన్స్‌ స్టోర్‌కు 1.10 శాతం ఇంటర్ ఛేంజ్ ఫీజు వర్తిస్తుంది.ఏదేమైనా గరిష్ఠంగా రూ.15 మాత్రమే వసూలు చేస్తారని ఇక్కడ గుర్తు పెట్టుకోండి.ఇందులో మీరు ఏ కేటగిరిలో ఎక్కువ పేమెంట్స్ చేస్తారో చూసుకుంటే సరిపోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube