హైదరాబాద్లోని గాంధీభవన్లో తెలంగాణ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు.దీనిలో భాగంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు.
అనంతరం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఉద్యమ కారుల వీరోచిత పోరాటంతోనే స్వేచ్ఛ లభించిందని రేవంత్ రెడ్డి తెలిపారు.
భూస్వాములకు వ్యతిరేకంగా వారు పోరాటం చేశారన్నారు.బైరాన్ పల్లి తరహా ఘటనలు తెలంగాణలో చాలా జరిగాయన్న ఆయన.కొందరు చరిత్రను వక్రీకరిస్తున్నారని విమర్శించారు.ఉద్యమాన్ని రాజకీయం చేస్తూ.
కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు.