తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరి కాసేపటిలో ప్రారంభం కానున్నాయి.ఈ మేరకు ఇవాళ అసెంబ్లీలో విద్యుత్ రంగంపై కీలక చర్చ జరగనుంది.
విద్యుత్ రంగంపై శ్వేతపత్రంలోని అంశాలపై అధికార, విపక్ష సభ్యులు చర్చించనున్నారు.పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ రంగం అప్పులకుప్పగా మారిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించింది.అలాగే రూ.81 వేల కోట్ల అప్పుల్లో విద్యుత్ రంగం ఉందని చెబుతోంది.కాగా బీఆర్ఎస్ తరపున విద్యుత్ శాఖ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడనున్నారు.కాగా నిన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వాడీవేడీ చర్చలు జరిగిన సంగతి తెలిసిందే.